Raveena Tandon: కమ్మలు బాగున్నాయి అన్న ఫోటోగ్రాఫర్.. బంగారాన్ని బహుమతిగా ఇచ్చిన నటి.. షాక్ లో నెటిజన్స్!
తాజాగా ఒక నటి ఫోటోగ్రాఫర్ నీ కమ్మలు బాగున్నాయి అంటూ పొగడడంతో వెంటనే ఆలోచించకుండా తన బంగారు కమ్మలు తీసి అతనికి ఇచ్చేసింది.
- By Anshu Published Date - 11:34 AM, Fri - 7 March 25

మామూలు సెలబ్రిటీలు బయట కనిపించినప్పుడు ఫోటోలు తీయడం అన్నది. ముఖ్యంగా ఫోటో గ్రాఫర్లు వెంటపడి మరి ఫోటోలు తీయడం వారిని పొగడటం లాంటివి చేస్తూ ఉంటారు. డ్రెస్ బాగుంది. జ్యువలరీ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు థాంక్స్ చెబుతారు సంతోషిస్తారు. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే బాలీవుడ్ నటి మాత్రం ఏకంగా బంగారాన్ని కానుకగా ఇచ్చేసింది. ఇంతకీ ఆమె ఎవరు అన్న విషయానికొస్తే.. హీరోయిన్ రవీనా టండన్ రవీనా తన కూతురు రాషా తడానీతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో బుధవారం సాయంత్రం ప్రత్యక్షమైంది.
ఆమె కనిపించగానే ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు తనను వెంబడిస్తూ కెమెరాలో రికార్డు చేస్తున్నారు. అయితే వారిలో ఒకరు రవీనాను తన చెవిదిద్దులు బాగున్నాయని పొగిడాడు. దాంతో రవీనా ఏ కమ్మ బాగుందని అడుగుతూ దాన్ని తీసేసింది. తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తిని ఆ బంగారు దిద్దును బహుమతిగా ఇచ్చేసింది. ఇదంతా చూసిన రాహా తల్లి చేసిన పనికి నోరెళ్ల బెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీనా మనసు బంగారం ఈ రోజుల్లో బంగారాన్ని దానం చేసే మహానుభావులు ఎవరున్నారు? వావ్, మంచి మనసున్న వాళ్లకే ఇలాంటివి సాధ్యం అవుతాయి.
తను నిజంగా గ్రేట్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రవీనా ఇలా తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఒక పెళ్లికి హాజరైన ఆమె పెళ్లి కూతురికి తన గాజుల్ని గిఫ్ట్ గా ఇచ్చింది. అవి సాధారణ బ్యాంగిల్స్ కావు. వాటిపై రవీనా పేరుతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా రాసి ఉంది. అయినా అవేమీ పట్టించుకోకుండా వాటిని కొత్త జంటకు కానుకగా ఇచ్చేసింది. ఏ మాటికి ఆ మాట నిజంగా రవీనా మనసు బంగారం అని చెప్పాలి..