Ratan Tata : రతన్ టాటా నిర్మించిన సినిమా ఏంటో తెలుసా..?
Ratan : సినిమాలంటే ఎంతో ఇష్టం ఉన్న ఆయన ఓ సినిమా నిర్మించారు. కేవలం ఒకే ఒక సినిమా మాత్రమే నిర్మించారు
- By Sudheer Published Date - 04:30 PM, Thu - 10 October 24

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్త అనేది యావత్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాటా ఇకలేరు అని తెలిసి పలు రంగాలకు చెందిన ప్రముఖులే కాదు సామాన్య ప్రజలు సైతం సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యంలో మకుటం లేని రారాజుగా వెలుగొందిన టాటా.. సినీ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమాలంటే ఎంతో ఇష్టం ఉన్న ఆయన ఓ సినిమా నిర్మించారు. కేవలం ఒకే ఒక సినిమా (Ratan Tata co-produced a Bollywood movie ) మాత్రమే నిర్మించారు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన ఏత్ బార్ (Aetbaar) అనే మూవీకి రతన్ టాటా నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమాకు నలుగురు నిర్మాతలు ఉన్నారు. వారిలో రతన్ టాటా ఒకరు. జతిన్ కుమార్, ఖుష్రు బుద్రా, మన్‌దీప్ సింగ్ కూడా ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. అయితే రతన్ టాటానే ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా వ్యవహరించారు. 1992లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫియర్’ స్ఫూర్తితో ఏత్ బార్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ భట్ డైరెక్షన్ చేయగా.. 2002లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 9.50 కోట్లు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 7.50 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ చిత్రం బాక్స్ ఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రతన్ టాటా మళ్లీ సినీ ఇండస్ట్రీవైపు చూడలేదు. ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యుంటే..టాటా వరుస సినిమాలు నిర్మించే వారు కావొచ్చు.
Read Also : Saddula Bathukamma : సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్