Rashmika Mandanna : మిలన్ ఫ్యాషన్ వీక్ లో రష్మిక.. అమ్మడి ఖాతాలో మరో రికార్డ్..!
Rashmika Mandanna నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేనప్పుడు అదరగొట్టిన రష్మిక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజైన యానిమల్ హిట్ తో
- By Ramesh Published Date - 11:59 AM, Thu - 22 February 24
Rashmika Mandanna నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేనప్పుడు అదరగొట్టిన రష్మిక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజైన యానిమల్ హిట్ తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు వాటి ఫలితాలు అన్నీ రష్మికని టాప్ రేంజ్ కి వెళ్లేలా చేస్తున్నాయి. ఇప్పుడు సౌత్ నార్త్ ఎక్కడ చూసినా సరే రష్మిక పేరు వినపడుతుంది.
యానిమల్ తర్వాత త్వరలో పుష్ప 2 తో సత్తా చాటనుంది రష్మిక. ఇదిలాఉంటే అమ్మడు పారిస్ లో మిల ఫ్యాషన్ వీక్ లో పాల్గొనబోతుందని తెలుస్తుంది. పారిస్ లో జరిగే మిలన్ ఫ్యాన్స్ వీక్ 2024 లో ర్యాంప్ వాక్ చేసేందుకు రష్మిక అవకాశం దక్కించుకుంది. సౌత్ హీరోయిన్స్ లో చాలా తక్కువమందికి ఈ ఛాన్స్ దొరుకుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ మోడల్స్ అంతా కూడా అక్కడ పాల్గొంటారు. రష్మిక కూడా జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ఒనిట్ సుక టైగర్ అవుట్ ఫిట్ తో అక్కడ ర్యాంప్ వాక్ చేయనుంది. ఇండియన్ స్టార్స్ లో చాలా తక్కువమందికి ఈ ఛాన్స్ రాగా అక్కడ ర్యాంప్ వాక్ చేసే అవకాశం దక్కించుకున్న స్టార్ గా రష్మిక మరో రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాలతో తన క్రేజ్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యేలా చేసుకుంటుంది అమ్మడు.
Also Read : Venkatesh Trisha : వెంకటేష్.. త్రిష.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!