Rashmika : రష్మిక హెల్త్ విషయంలో ఖంగారు పడుతున్న ఫ్యాన్స్
- Author : Sudheer
Date : 16-11-2023 - 1:18 IST
Published By : Hashtagu Telugu Desk
రష్మిక (Rashmika) కు ఏమైందో అని ఆమె ఫ్యాన్స్ ఖంగారుపడుతున్నారు. రష్మిక అంటే తెలియని సినీ లవర్స్ ఉండరు. చలో (Chalo) , గీత గోవిందం (Geetha Govindam) సినిమాలతో ఎంతో ఫేమస్ అయినా రష్మిక..పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో స్టార్ గా గుర్తింపు సాధించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుండగా..ఓ ఫేక్ డీప్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటీష్ ఇండియన్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ (Zara Patel) కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీనిపై యావత్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు స్పందించి రష్మిక కు సపోర్ట్ గా నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ పిక్ ఆమె అభిమానులను ఖంగారు కు గురి చేసింది. గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించి బెడ్‌పై పడుకుని ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అంతేకాకుండా ”రికవరీ చాలా ముఖ్యం” అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రష్మికకు ఏమైందని కంగారు పడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రష్మిక వైరల్ ఫీవర్‌తో గత కొద్ది రోజుల నుంచి బాధపడుతుందట. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. ఇదే ఆమె పోస్ట్ ద్వారా తెలిపినట్లు చెపుతున్నారు. ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Recovery is important as well. 🤍 pic.twitter.com/SGh9TYgjbr
— Rashmika Mandanna (@iamRashmika) November 15, 2023