Rashmika Mandanna : 2024 రష్మిక రఫ్ఫాడించేస్తుందా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేసినా
- Author : Ramesh
Date : 02-10-2023 - 12:29 IST
Published By : Hashtagu Telugu Desk
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేసినా అవి సరిగా ఆడకపోవడంతో అమ్మడు డీలా పడింది. ఓ పక్క తనకు స్టార్ డం ఇచ్చిన తెలుగులో కూడా ఆఫర్లు కరువయ్యాయి. ఈ టైం లో రష్మిక తన కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. ప్రస్తుతం రెయిన్ బో అంటూ ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్న రష్మిక మరోపక్క సందీప్ వంగ డైరెక్షన్ లో యానిమల్ సినిమాలో కూడా నటిస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) లో కూడా అమ్మడు ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2లో కేవలం ఒక సాంగ్ కొన్ని సీన్స్ మాత్రమే రష్మిక ఉంటుందని తెలుస్తుంది. యానిమల్ (Animal) సినిమా ఈ ఏడాది డిసెంబర్ రిలీజ్ అవుతుండగా పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ ఆగష్టు రిలీజ్ ఫిక్స్ చేశారు. దీనితో పాటుగా గౌతం తిన్ననూరి విజయ్ దేవరకొండ కాంబో సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. విజయ్ రష్మిక (Rashmika) మూవీ అంటే ఆ ఇద్దరి ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క.
విజయ్ రష్మిక ఇద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలతో ఇద్దరు ఆన్ స్క్రీన్ జోడీగా అదరగొట్టగా ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్ ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా ధనుష్ (Dhanush) శేఖర్ కమ్ముల కాంబో సినిమాలో కూడా రష్మిక నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రాబోతుంది.
సో ఈ ఇయర్ చివర్లో యానిమల్ తో మొదలు పెడితే 2024 నాలుగు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో రష్మిక తన సత్తా చాటనుందని చెప్పొచ్చు. సౌత్ ఓలో మంచి ఫాలోయింగ్ ఉన్న రష్మిక బీ టౌన్ ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకోవడంలో విఫలమైంది. మరి అమ్మడు చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లు రష్మికకు ఎలాంటి రిజల్ట్ అందిస్తాయో చూడాలి.
Also Read : Guntur Kaaram: తగ్గేదేలే.. అనుకున్న తేదీకి గుంటూరు కారం రిలీజ్