HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rashmi Gautam Makes Sensational Remarks Against Modi

Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 11-05-2026 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashmi Gautam About Pm Modi
Rashmi Gautam About Pm Modi

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ తన రాజకీయ మొగ్గును, సామాజిక దృక్పథాన్ని స్పష్టం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడతారు, కానీ రష్మీ మాత్రం ఎంతో ధైర్యంగా తన గళాన్ని వినిపించారు.

రష్మీ గౌతమ్ తన పోస్ట్‌లో భారతీయ జనతా పార్టీకి, ప్రధాని మోదీకి తన పూర్తి మద్దతు ఉంటుందని నిస్సంకోచంగా ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో ఒక ముఖ్యమైన క్లారిటీ కూడా ఇచ్చారు. పార్టీకి మద్దతు ఇస్తున్నంత మాత్రాన, మహిళలపై జరిగే అఘాయిత్యాలను లేదా నేరస్తులను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. రాజకీయ మద్దతు వేరని… మానవత్వం, నైతిక విలువలు వేరని ఆమె చెప్పారు. తనను విమర్శించే వారు లేదా దూషించే వారి గురించి తాను అస్సలు పట్టించుకోనని, అలాంటి వారి వల్ల తన సమయం వృథా చేసుకోనని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

మరోవైపు, ప్రతి సామాజిక సమస్యపై సెలబ్రిటీలను ట్యాగ్ చేసే సంస్కృతిపై రష్మీ అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక పోస్ట్ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో మార్పు రాదని, సమస్యలను పరిష్కరించే అధికారం ఉన్న అధికారులను ప్రశ్నించాలని ఆమె సూచించారు. తాను మనుషుల సమస్యల పట్ల సానుభూతి చూపగలను తప్ప, వాటిపై పోరాడే శక్తి తనకు లేదని ఆమె నిజాయతీగా అంగీకరించారు. అందుకే, గొంతులేని మూగజీవాల సంరక్షణకే తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని, ఆ దిశగానే తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Animal welfare
  • Bharatiya Janata Party (BJP)
  • narendra modi
  • political support
  • Rashmi Gautam
  • women safety

Related News

PM Modi extends massive support to earthquake-hit Venezuela; India ready to provide assistance.

Venezuela Earthquake: భూకంపాల్లో దెబ్బతిన్న వెనిజులాకు ప్రధాని మోదీ భారీ మద్దతు.. సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి

భీకర జంట భూకంపాలు వెనెజువెలా దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నమోదైన ఈ భూకంపాల విధ్వంసంపై భారత ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… విపత్తు బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహక

  • Discussion on a reshuffle in Modi's cabinet?

    PM MODI: మోదీ కేబినెట్ లో మార్పుపై చర్చ?

Latest News

  • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

  • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

  • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

  • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

  • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd