Ranveer Singh : ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ సినిమా ఆగిపోయిందా..?
'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తో చేస్తున్న సినిమా ఆగిపోయిందా..?
- By News Desk Published Date - 06:47 AM, Wed - 22 May 24

Ranveer Singh : ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన తదుపరి సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తో చేస్తున్నారనే వార్త బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. కానీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ గా షూటింగ్ ని జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. ఈ సినిమా ఆగిపోయిందట. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సినిమాని నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజం గురించి పలువురు విలేకర్లు చిత్ర యూనిట్ ని సంప్రదించగా.. అవి రూమర్స్ మాత్రమే అని తెలియజేసినట్లు సమాచారం. ఈ రూమర్స్ కి మరికొన్ని రోజుల్లో ఓ క్లారిటీ రానుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు అధికారికంగా అనౌన్స్ చేయని ఈ మూవీని.. ఓ గ్లింప్స్ తో ప్రకటించనున్నారట. ప్రస్తుతం ఆ గ్లింప్స్ ని ప్రశాంత్ వర్మ సిద్ధం చేస్తున్నారట. మరికొన్ని రోజుల్లో ఆ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసి.. ప్రస్తుతం వస్తున్న రూమర్స్ కి కూడా చెక్ పెట్టనున్నారట. కాగా ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే తెరకెక్కతుందని సమాచారం. ఈ సినిమాకి ‘బ్రహ్మరాక్షస’, ‘రాక్షస’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ టైటిల్ ని చూస్తుంటే.. ఇది సూపర్ విలన్ కి సంబంధించిన కథా అనే డౌట్ కలుగుతుంది. ఈ సినిమాతో రణ్‌వీర్ ని సూపర్ హీరోగా కాకుండా సూపర్ విలన్ గా చూపించబోతున్నారా అనే సందేహం వస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం.