HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rangasthalam Combo Repeats Soon

Rangasthalam Combo: టాలీవుడ్ లో సెన్సేషన్ కాంబో ఫిక్స్?

ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన రాబోయే సినిమాలను కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు

  • Author : Praveen Aluthuru Date : 29-01-2024 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rangasthalam Combo
Rangasthalam Combo

Rangasthalam Combo: ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన రాబోయే సినిమాలను కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం చెర్రీ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది.

రామ్ చరణ్‌ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో రంగస్థలం టాప్ స్థానంలో ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. చరణ్ లో ఉన్న నటుడ్ని బయటకు తీసింది ఈ సినిమానే. అప్పటి వరకు చరణ్‌ పై నటనపరంగా విమర్శలు వుండేవి. అయితే.. ఆ విమర్శలకు రంగస్థలం సినిమా కరెక్ట్ గా సమాధానం చెప్పింది. అందుకనే చరణ్‌ కు సుకుమార్ అంతే ప్రత్యేక అభిమానం. ఇప్పుడు రంగస్థలం కాంబో ఫిక్స్ అయ్యిందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేస్తున్నారు. ఇక సుకుమార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా అనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు చరణ్‌ తో సుకుమార్ మూవీ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీలోనూ, మీడియాలోనూ గట్టిగా వినిపిస్తోంది. అయితే.. సుకుమార్ దగ్గర చరణ్ కు సరిగ్గా సరిపోయే కథ ఒకటి ఉంది. ఇది నిజమే కానీ.. పూర్తి స్థాయిలో కథ రెడీగా లేదు. మరో వార్త ఏంటంటే.. పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ప్లానింగ్ లో ఉందట.

బన్నీ కూడా పుష్ప 3 చేద్దామంటున్నాడట. అందుచేత సుకుమార్ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. చరణ్‌ గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. బుచ్చిబాబుతో చేసే సినిమా నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు సుకుమార్ మరో సినిమా చేయకుండా చరణ్‌ కోసం వెయిట్ చేస్తాడా..? లేక వేరే సినిమా చేస్తాడా..? అనేది తెలియాల్సివుంది. రంగస్థలం కాంబో ఉండడం మాత్రం ఫిక్స్. కాకపోతే ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ క్రేజీ కాంబో పై క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Bagalkot: కర్ణాటకలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • ram charan
  • Rangasthalam
  • sukumar

Related News

mega family ram charan upasana twins naming ceremony

రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

Ram Charan  గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్‌ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు (బాబు, పాప) జన్మించిన విషయం తెలిసిందే. 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని స

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd