Rashmika’s Style: రష్మిక స్టైల్ లో హాయ్ చెప్పిన రణ్ బీర్.. చూద్దాం రండి!!
రష్మిక మందన "హాయ్" చెప్పే డిఫరెంట్ స్టైల్ ని రణ్ బీర్ కపూర్ సైతం కాపీ చేశారు.బొటన వేలిని, చూపుడు వేలిని దగ్గరకు చేర్చి.. మెలి వేసి హృదయం ఆకారం లో కూర్చడమే రష్మిక్ మందన "హాయ్' సింబల్!
- By Hashtag U Published Date - 07:30 AM, Thu - 4 August 22
రష్మిక మందన “హాయ్” చెప్పే డిఫరెంట్ స్టైల్ ని రణ్ బీర్ కపూర్ సైతం కాపీ చేశారు.బొటన వేలిని, చూపుడు వేలిని దగ్గరకు చేర్చి.. మెలి వేసి హృదయం ఆకారం లో కూర్చడమే రష్మిక్ మందన “హాయ్’ సింబల్!
“హాయ్’ సింబల్ ..
రష్మిక్ మందన, రణ్ బీర్ కపూర్ కాంబినేషన్లో “యానిమల్” సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన షూటింగ్ చకచకా జరుగుతోంది. ఈక్రమంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కుర్చీ మీద కూర్చొని ఉండగా.. రణ్ బీర్ కపూర్
“హాయ్’ సింబల్ ను చూపిస్తున్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. దీన్ని రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. “సందీప్ రెడ్డి వంగా..రణ్ బీర్ కపూర్ .. ఇద్దరూ హాయ్ చెబుతున్నారు” అని ఆమె కామెంట్ పెట్టారు. వాస్తవానికి యానిమల్ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ పరిణీతి ఆ ఛాన్స్ ను కాదని చెప్పడంతో.. రష్మికని హీరోయిన్ గా ఎంపిక చేశారు. మనాలీలో రణ్ బీర్ కపూర్ , రష్మిక మధ్య షూటింగ్ జరుగుతున్న దృశ్యాలు కొన్ని నెలల క్రితం వైరల్ అయ్యాయి.
రాబోయే మూవీస్ ఇవే..
అమితాబ్ బచ్చన్‌తో కూడా గుడ్ బై అనే ఓ సినిమాను రష్మిక చేస్తోంది. దీంతోపాటు మిషన్ మంజు, విజయ్ సరసన వారిసు అనే తమిళ్ మూవీలో రష్మిక నటిస్తోంది. తమిళ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి రష్మిక సీతారామం సినిమాలో కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్..మృణాల్ ఠాకూర్..రష్మిక నటించిన ప్రేమ కథా చిత్రం సీతారామం. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. సీతారామం సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆగష్టు 5న థియేటర్లలో విడుదల కానుంది.
Related News
Sai Pallavi : సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు తీసుకుంటుందా..!
బాలీవుడ్ రామాయణంలో సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు పారితోషకం తీసుకుంటుందా..?