Ranbir Kapoor Animal OTT Version : యానిమల్ ఓటీటీ వెర్షన్.. వాళ్లని అసంతృప్తి పరచిన సందీప్ వంగ..!
Ranbir Kapoor Animal OTT Version సందీప్ వంగ రెడ్డి రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా యానిమల్. టీ సీరీస్ నిర్మించిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ విశ్వరూపం
- By Ramesh Published Date - 05:25 PM, Fri - 26 January 24

Ranbir Kapoor Animal OTT Version సందీప్ వంగ రెడ్డి రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా యానిమల్. టీ సీరీస్ నిర్మించిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ విశ్వరూపం చూపించాడు. తండ్రి కొడుకుల మధ్య కథతో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
We’re now on WhatsApp : Click to Join
డిసెంబర్ 1న థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా 1000 కోట్లకు అటు ఇటుగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ చూడని వారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూశారు.
ఫైనల్ గా వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ సినిమాను రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో నైట్ నుంచి యానిమల్ (Animal) సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్ కు మరో 20 నిమిషాల అన్ సెన్సార్డ్ సినిమా యాడ్ చేయాలని అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ మళ్లీ లీగల్ ప్రాబ్లెంస్ వస్తాయని ఆ ప్రాయ్త్నం వెనక్కి తీసుకుంది.
ముఖ్యంగా రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), బాబీ డియోల్ ల మధ్య వచ్చే ఒక సీన్ గురించి సందీప్ వంగ చెప్పాడు. అది ఓటీటీలో రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేకుండానే సినిమాను వదిలారు. థియేట్రికల్ వెర్షన్ ఎలా ఉందో ఓటీటీలో అదే సినిమాను రిలీజ్ చేశారు. మరి ఓటీటీలో యానిమల్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read : Mohanlal Neru Movie Talk : జీతూ జోసెఫ్.. మోహన్ లాల్.. నెరు మరో హిట్టు బొమ్మ..!