Ranbhir Kapoor Lovestory : యానిమల్ తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నాడా.. హీరోయిన్ గా భార్య మరో హీరో కూడా..!
Ranbhir Kapoor Lovestory యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ గ్రాండ్ హిట్ అందుకున్న హీరో రణ్ బీర్ కపూర్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నారు.
- By Ramesh Published Date - 03:42 PM, Wed - 24 January 24
Ranbhir Kapoor Lovestory యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ గ్రాండ్ హిట్ అందుకున్న హీరో రణ్ బీర్ కపూర్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. యానిమల్ తర్వాత యానిమల్ పార్క్ కూడా ఉంటుందని ప్రకటించాడు సందీప్ వంగ అయితే ఆ సినిమా వచ్చే లోగా మరో సినిమా చేయాలని చూస్తున్నాడు రణ్ బీర్ కపూర్. అది బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
సంజయ్ లీలా భన్సాలి సినిమా అంటే బాలీవుడ్ ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్. అందులోనూ యానిమల్ తర్వాత రణ్ బీర్ తో చేస్తున్నాడంటే అది వేరే రేంజ్ లో ఉంటుంది. అయితే సంజయ్ రణ్ బీర్ ఒక లవ్ స్టోరీని తెరకెక్కిస్తారని తెలుస్తుంది. రణ్ బీర్ కపూర్ తో పాటుగా ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా ఉంటాడట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా రణ్ బీర్ వైఫ్ అలియా నటిస్తుందని తెలుస్తుంది.
లవ్ స్టోరీ అంటున్నారు ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ అంటున్నారంటే ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా చేస్తారా ఏంటని ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా యానిమల్ తర్వాత రణ్ బీర్ కపూర్ ఒక లవ్ స్టోరీ చేయడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటైల్స్ త్వరలో వస్తాయి. ఈ లవ్ స్టోరీ తర్వాత సందీప్ వంగ యానిమల్ పార్క్ చేయనున్నాడు రణ్ బీర్ కపూర్.
Also Read : Tabu : పాతికేళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో టబు.. క్రేజీ ప్రాజెక్ట్ తో ఎంట్రీ..!