Miheeka Bajaj : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన రానా భార్య.. ఓపెనింగ్ కి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి..
తాజాగా మిహీక ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టింది.
- By News Desk Published Date - 10:52 AM, Wed - 8 January 25

Miheeka Bajaj : రానా(Rana) భార్య మిహీక బజాజ్ అందరికి పరిచయమే. ఈమె బిజినెస్ ఫ్యామిలీ నుంచే వచ్చింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రానా భార్య మిహీక. అయితే తాజాగా మిహీక ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. ఫుడ్ స్టోరీస్ అనే ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ కి ఫ్రాంచైజ్ తీసుకుంది.
తాజాగా మిహీక ఫుడ్ స్టోరీస్ బ్రాంచ్ హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓపెన్ చేసారు. ఈ షాప్ ఓపెనింగ్ కి రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళి గెస్టులుగా వచ్చారు. రానా కూడా వీరితో వచ్చారు. అలాగే ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్ మరికొంతమంది సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఫుడ్ స్టోరీస్ ఓపెనింగ్ కి వచ్చారు.
తాజాగా రానా భార్య మిహీక రాజమౌళి, రమా రాజమౌళి, రానాలతో తన ఫుడ్ స్టోరీస్ షాప్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త బిజినెస్ మొదలుపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసింది.
Also Read : Toxic : KGF యశ్ నెక్స్ట్ సినిమా ‘టాక్సిక్’ గ్లింప్స్ వచ్చేసింది..