Rana : మహేష్ రాజమౌళి సినిమా.. హాలీవుడ్ రేంజ్ అంటున్న బాహుబలి స్టార్..!
Rana మహేష్ కోసం ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా నుంచి త్వరలో క్రేజీ అప్డేట్ రాబోతుంది.
- By Ramesh Published Date - 08:45 AM, Thu - 21 November 24

RRR తర్వాత రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్నాడు. ఈ సినిమా పై అంచనాలు ఎలా ఉన్నాయన్నది మాటల్లో చెప్పడం కష్టమే. SSMB29 సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ అవుతున్నారు. ఐతే ఈ సినిమాపై తన మనసులో మాట చెప్పాడు బాహుబలి స్టార్ రానా (Rana). రాజమౌళి మహేష్ బాబు సినిమా కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ సినిమా అవుతుందని ఆయన అన్నారు. ఒక హాలీవుడ్ సినిమా అమెరికాలో ఎంత భారీగా రిలీజ్ అవుతుందో అంతే భారీగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు.
మహేష్ (Mahesh) కోసం ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా నుంచి త్వరలో క్రేజీ అప్డేట్ రాబోతుంది. 2025 జనవరి నుంచి ఈ సినిమా మొదలు కాబోతుందని తెలుస్తుంది. సినిమా కాస్టింగ్ ని ఎంపిక చేసే క్రమంలో బిజీగా ఉన్నారు రాజమౌళి (Rajamouli).
మహేష్ డిఫరెంట్ లుక్స్..
ఈ సినిమా కోసం మహేష్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల టైం ఇచ్చేసినట్టు తెలుస్తుంది. మహేష్ ఫ్యాన్స్ ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నా ఇన్నేళ్ల వెయిటింగ్ కు తగిన సినిమానే అందిస్తారన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాలతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మహేష్ రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు.
ప్రస్తుతం రానా కాంతా సినిమా చేస్తున్నాడు. అమేజాన్ ప్రైం తో కలిసి రానా ఒక టాక్ షో హోస్ట్ గా చేస్తున్నారు. దీనికి సంబందించిన ప్రోమో రీసెంట్ గా రిలీజైంది.
Also Read : Sharwanand Maname : శర్వా సినిమా OTT రిలీజ్ బ్రేక్ వెనక కారణాలు అవేనా..?