Sharwanand Maname : శర్వా సినిమా OTT రిలీజ్ బ్రేక్ వెనక కారణాలు అవేనా..?
Sharwanand Maname మనమే సినిమా OTT రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. దాదాపు సినిమా రిలీజై ఐదారు నెలలు అవుతున్నా ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు.
- By Ramesh Published Date - 07:47 AM, Thu - 21 November 24

శర్వానంద్ లీడ్ రోల్ లో ఉప్పెన భామ కృతి శెట్టి (Krithi Shetty) ఫిమేల్ లీడ్ గా వచ్చిన సినిమా మనమే. శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజైన ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది కానీ ఆడియన్స్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఐతే ఈమధ్య కొన్ని సినిమాలు థియేటర్ లో చూడకపోయినా OTTలో వచ్చాక సూపర్ అనేస్తున్నారు.
మనమే (Maname) సినిమా OTT రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. దాదాపు సినిమా రిలీజై ఐదారు నెలలు అవుతున్నా OTTలో మాత్రం రిలీజ్ కాలేదు. దీని వెనక రీజన్స్ ఏంటన్నది బయటకు రాలేదు. ఐతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే శర్వానంద్ సినిమా ఓటీటీ రిలీజ్ కాలేదని తెలుస్తుంది. ముందు డిస్నీ హాట్ స్టార్ లో మనమే వస్తుందని చెప్పారు. కానీ సోనీ లివ్ లో ఈ సినిమా రాబోతుంది.
డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో..
ఇన్నాళ్లు OTT సంస్థ నుంచి నిర్మాతకు డబ్బులు అందలేదనే ఈ సినిమా OTT రిలీజ్ కు క్లియరెన్స్ ఇవ్వలేదట. ఐతే ఇప్పుడు ఆ సమస్య సాల్వ్ అయినట్టు తెలుస్తుంది. సో త్వరలోనే అంటే డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో మనమే సినిమా OTT రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తిరుగుబోతుగా ఉండే ఒక వ్యక్తికి లైఫ్ లో ప్రేమ పెళ్లి ఆ తర్వాత ఒక బాబు వస్తే అతను లైఫ్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడు.. ఆ తర్వాత వచ్చే సమస్యలతోనే ఈ సినిమా తెరకెక్కించారు.
శర్వానంద్ (Sharwanand), కృతి శెట్టి జోడీ బాగున్నా సినిమా ఎందుకో ఆడియన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
Also Read : Vijay Sethupati Maharaja : అక్కడ 40000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా..!