Ram Puri Jagannath Double Ismart : మణిశర్మ దమ్ము చూపించాల్సిన టైం ఇదే..!
Ram Puri Jagannath Double Ismart పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో ఈ కాంబో
- Author : Ramesh
Date : 27-01-2024 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Puri Jagannath Double Ismart పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో ఈ కాంబో మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదీగాక ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అని వస్తున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ బజ్ ని ఏర్పరచుకుంది.
We’re now on WhatsApp : Click to Join
రామ్ స్కంద ఫ్లాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ తో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాడు పూరీ జగన్నాథ్.
సినిమాలో రామ్ ని ఢీ కొట్టే పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు. రీసెంట్ గా సినిమాలో ఒక భారీ యాక్షన్ ఫైట్ కోసం ముంబైలో ఏడున్నర కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ సెట్ కూడా వేశారట. మాస్ ఆడియన్స్ కి ఈ ఫైట్ ఐ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి కూడా మణిశర్మ మ్యూజిక్ సినిమా హిట్ కు కారణమైంది. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
పూరీ జగన్నాథ్ తో మణిశర్మ ఫస్ట్ టైం మహేష్ పోకిరి సినిమాకు పనిచేశారు. ఆ సినిమాలోని సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్లే. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా పూరీ తన సినిమాకు కావాల్సిన మ్యూజిక్ ని మణిశర్మ దగ్గర నుంచి తీసుకున్నాడు. డబుల్ ఇస్మార్ట్ కి కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నాడట మణిశర్మ.
Also Read : Prabhas Rebal Star Fans : ప్రభాస్ సరసన శ్రీలీల.. ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ..!
అంతేకాదు కొంతకాలంగా వెనకబడిన మణిశర్మ ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నారు. మణిశర్మ దమ్ము చూపించాల్సిన టైం కాబట్టి పూరీ డబుల్ ఇస్మార్ట్ తో మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.
ఒకప్పుడు స్టార్ సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మణిశర్మ ఈమధ్య ఫాం కోల్పోయాడు. ఐయితే తనకు వచ్చిన ఒకటి రెండు ఛాన్స్ లతో అయినా తన మ్యూజిక్ తో అదరగొడుతున్నాడు మణిశర్మ. మరి డబుల్ ఇస్మార్ట్ తో మణిశర్మ ఆ రేంజ్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.