Game Changer : తన ‘గేమ్’ ను పూర్తి చేసిన ‘ఛేంజర్’
తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ తాలూకా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 05:40 PM, Sat - 6 July 24

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – సంచలన డైరెక్టర్ శంకర్ (Ram Charan & SHankar) కలయికలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మొదలుపెట్టి దాదాపు మూడు ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు షూటింగ్ పూర్తికాలేదు.
We’re now on WhatsApp. Click to Join.
డైరెక్టర్ శంకర్ ఈ మూవీ తో పాటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 తెరకెక్కిస్తుండడం తో గేమ్ చేంజర్ షూటింగ్ నత్తనడకన సాగుతూ వస్తుంది. రీసెంట్ గా ఇండియన్ 2 షూటింగ్ పూర్తి కావడం తో శంకర్ పూర్తి ఫోకస్ గేమ్ ఛేంజర్ ఫై పెట్టాడట.. వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ కూడా పూర్తి చేయాలనీ కంకణం కట్టుకున్నాడట. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ తాలూకా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కథ అంత కూడా రాజకీయం, ఎలక్షన్ సిస్టమ్ నడుస్తుందని టాక్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. థమన్ మ్యూజిక్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం తో నెక్స్ట్ చరణ్ బుచ్చిబాబు మూవీ ని సెట్స్ పైకి తీసుకొస్తారు కావొచ్చు.
Read Also : Suryakumar Yadav Catch: సూర్య క్యాచ్ పట్టకపోయి ఉంటే.. రోహిత్ ఫన్నీ కామెంట్స్