Ram Charan : వైజాగ్ గడ్డపై ‘జై జనసేన’ అంటూ పిలుపునిచ్చిన రామ్ చరణ్
రామ్ చరణ్ సైతం జై జనసేన అంటూ వారితో గొంతు కలిపారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అడ్డు లేకుండా పోయింది
- By Sudheer Published Date - 07:50 PM, Tue - 19 March 24

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)..నోటి వెంట జై జనసేన (Jai Janasena) అనే పదం అభిమానుల్లో, జనసేన కార్యకర్తల్లో జోష్ నింపింది. ప్రస్తుతం రామ్ చరణ్..శంకర్ (Director Shankar) డైరెక్షన్లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీ షూటింగ్ రెండు రోజులుగా RK బీచ్ లో నడుస్తుంది. దీంతో అభిమానులు చరణ్ ను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ సమయంలో కొందరు జై పవన్ కల్యాణ్, జై జనసేన అంటూ రామ్ చరణ్ ముందు నినాదాలు చేశారు. రామ్ చరణ్ సైతం జై జనసేన అంటూ వారితో గొంతు కలిపారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో ఉన్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే..గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి..ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి టిడిపి , బిజెపి లతో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగబోతుంది. ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి బరిలోకి దిగబోతున్నారు. పిఠాపురం లో గెలిచి…అసెంబ్లీ లో అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈసారి ఎన్నికల ప్రచారంలో మెగా హీరోలు కూడా పాల్గొనబోతున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన పార్టీ కి ప్రచారం చేయమని కానీ , మద్దతు ప్రకటించామని కానీ ఎవ్వర్నీ అడగలేదు. అసలు ఒకరి సపోర్ట్ తీసుకోవాలని అని కూడా అనుకోలేదు. కానీ ఈసారి పవన్ వద్దన్నా కానీ మీము ప్రచారం చేస్తాం అంటూ చాలామంది యంగ్ హీరోలు చెపుతున్నారు. మరి పవన్ కోసం ఎవరెవరు రంగంలోకి దిగుతారో చూడాలి.
Read Also : Jagan : ప్రొద్దుటూరు లో జగన్ మొదటి ఎన్నికల సభ..