HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Met An Accident During Racha Movie Shooting

Ram Charan : రచ్చ సినిమా షూటింగ్‌లో.. రామ్‌చరణ్‌కి రైలు యాక్సిడెంట్..

రచ్చ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌కి రైలు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న చరణ్ పైకి ట్రైన్ దూసుకు వచ్చింది.

  • Author : News Desk Date : 05-04-2024 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan Met An Accident During Racha Movie Shooting
Ram Charan Met An Accident During Racha Movie Shooting

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు సినిమా ‘మగధీర’తోనే ఇండస్ట్రీ హిట్టు అందుకొని కొత్త రికార్డులు సృష్టించారు. ఆ తరువాత చరణ్ చేయబోయే సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులంతా పవర్ ప్యాకెడ్ మూవీని ఆశిస్తే.. చరణ్ ‘ఆరెంజ్’ వంటి కంప్లీట్ లవ్ స్టోరీతో వచ్చారు. దీంతో ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ డిజాస్టర్ నుంచి బయటపడడం కోసం చరణ్ చాలా గ్యాప్ తీసుకోని చేసిన సినిమా ‘రచ్చ’. ఈ మూవీ రిలీజయ్యి నేటితో 12 ఏళ్ళు అవుతుంది.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2012 ఏప్రిల్ 5న రిలీజయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో హిట్ కొట్టడం కోసం చాలానే రిస్క్ లు చేసారు. ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్‌కి రైలు ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సీన్ లో రామ్ చరణ్ ఒక పోటీకి దిగుతారు. ఆ పోటీ ఏంటంటే.. పట్టాలు పై వస్తున్న రైలుకి ఎదురుగా కారు నడుపుతూ వెళ్ళాలి.

గోవాలో ఆ పోటీకి సంబంధించిన సీన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలోనే అనుకోని ప్రమాదం జరిగింది. ఆ సీన్ ని షూట్ చేస్తున్న సమయంలో చరణ్ పట్టాల పై ఉన్న కారులో కూర్చొని ఉన్నారు. ఇక పట్టాలు పై వస్తున్న ట్రైన్ కారు దగ్గరికి వచ్చేపాటికీ.. దానిని ఆపడం కోసం కేబుల్స్ ఫిక్స్ చేసారు. అయితే ఆ కేబుల్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ట్రైన్ కారు మీదకి దూసుకు వచ్చింది. అది గమనించిన రామ్ చరణ్ కారులో నుండి వెంటనే బయటకి దూకేశారు.

ఆ ప్రమాదంలో రామ్ చరణ్ చేతికి, కాలుకి గాయాలు అయ్యాయి. ఆ ప్రమాద సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారట. ఇక ఆ షెడ్యూల్ పూర్తి కాగానే.. చరణ్ శబరిమల వెళ్లి అయ్యప్పని దర్శించుకొని దీక్షని విరమించారట. ఇక ఆ ప్రమాదంలో జరిగిన గాయాల నుంచి కోలుకోవడం కోసం చరణ్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఈ వార్త నేషనల్ వైడ్ సెన్సేషన్ అయ్యింది.

Also read :Venkatesh : వెంకటేష్ కూతురి రిసెప్షన్‌లో.. ఎన్ని రకాల భోజనాలు పెట్టారో చూశారా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • global star
  • Racha
  • ram charan

Related News

Ram Charan Peddi Movie Audio Rights Sold for Huge Price Beats Pushpa 2 Rights

Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడిందంటూ

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • Peddi

    Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

  • Charan Bday

    Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !

  • Peddi

    Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్

Latest News

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd