Unstoppable Seasion 4 : బాలయ్య షో లో రామ్ చరణ్ సందడి
Unstoppable Season 4 : డిసెంబర్ 31 న అన్నపూర్ణ స్టూడియోలో రామ్ చరణ్ 'అన్‌స్టాపబుల్ 4' ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది
- By Sudheer Published Date - 05:39 PM, Sun - 29 December 24

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) సీజన్ మొదలైంది. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా..ఈ నాల్గొవ సీజన్ కూడా అంతే సక్సెస్ అవుతుంది. ప్రతి వారం ఓ సెలబ్రెటీ హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయబోతున్నాడు.
డిసెంబర్ 31 న అన్నపూర్ణ స్టూడియోలో రామ్ చరణ్ ‘అన్‌స్టాపబుల్ 4’ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది (Ram Charan In Unstoppable Season 4). ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ..చరణ్ కు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారో..? వాటికీ చరణ్ ఎలాంటి సమాదానాలు చెపుతారో అనేది ఆసక్తి గా మారింది. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విశేషాలను కూడా బాలకృష్ణ షో లో అడిగే ఛాన్స్ ఉంది.
Read Also : Raghurama New Year Gift : సీఎం చంద్రబాబుకు రఘురామ న్యూ ఇయర్ గిఫ్ట్