Ram charan in hollywood: హాలీవుడ్ లో మెరిసిన చరణ్!
ఇప్పుడు విశ్వవేదిక మీద మెరుస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఆయన ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం ఆయన లాస్ ఏంజెల్స్‌కి వెళ్లారు.
- Author : Hashtag U
Date : 09-01-2023 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పుడు విశ్వవేదిక మీద మెరుస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఆయన ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం ఆయన లాస్ ఏంజెల్స్‌కి వెళ్లారు. ఎస్.ఎస్.రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలోనూ, నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ నామినేట్ అయిందీ చిత్రం.
జనవరి 11న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ఆ వేడుక కన్నా ముందే మెగా పవర్ స్టార్ చరణ్ మరో వేడుకలో మెరిశారు. క్యాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ లో జరిగిన ఓ అందమైన వేడుకలో రామ్‌చరణ్ తళుక్కుమన్నారు. లూయిస్ విట్టన్ ఎక్స్ డబ్ల్యూ మ్యాగజైన్ సీజన్ కిక్ ఆఫ్ పార్టీల్లో హాలీవుడ్ సెలబ్రిటీలతో వేదిక పంచుకున్నారు రామ్‌చరణ్.
మిరిండా కెర్, మిశ్చల్ యోతో పాటు పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. మన దేశం నుంచి ఈ పార్టీకి హాజరైన ఏకైక నటుడు రామ్‌చరణ్ కావడం తెలుగు వారికి గర్వకారణం. తెలుగు సినిమాకు అంతర్జాతీయ వేదిక మీద ప్రాతినిధ్యం వహించారు రామ్‌చరణ్.
లూయిస్ విట్టన్ పార్టీలో రామ్‌చరణ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఆకట్టుకుంది. చూడచక్కగా ఉన్నారనే కితాబులు అందుతున్నాయి. బ్లేజర్, ప్రింటడ్ షర్ట్ తో హ్యాండ్‌సమ్‌గా కనిపించారు చరణ్.