Ram Charan: ముద్దుల కూతురు క్లీంకారతో రామ్ చరణ్ ఫారిన్ టూర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఎంత ప్రయారిటీ ఇస్తారో, అంతకు మించి ఫ్యామిలీకి అంతే ప్రయారిటీ ఇస్తారు.
- Author : Balu J
Date : 18-10-2023 - 3:03 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఎంత ప్రయారిటీ ఇస్తారో, అంతకు మించి ఫ్యామిలీకి అంతే ప్రయారిటీ ఇస్తారు. షూటింగ్స్ నుంచి ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో లాంగ్ టూరుకు వెళ్లడం చరణ్ కు అలవాటు. తాజాగా రామ్ చరణ్ ఫారిన్ ట్రిప్ కు బయల్దేరాడు. బిజీ షూటింగ్ షెడ్యూల్ లో కూడా కుటుంబం కోసం కాస్త సమయాన్ని తీసుకుని ఇటలీకి పయనమయ్యాడు. ఈ ట్రిప్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది తన ముద్దుల తనయ క్లీంకారకు తొలి ఫారిన్ ట్రిప్ కావడం గమనార్హం.
విమానాశ్రయంలో వారు వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతుల్లో వారి పెట్ డాగ్ రైమ్, ఉపాసన ఒడిలో క్లీంకార ఉన్నారు. ఫొటోల్లో చరణ్, ఉపాసన ఇద్దరూ క్యాజువల్ లుక్ లో ఉన్నారు. అయితే తమ కూతురు ముఖాన్ని మాత్రం కెమెరాలకు ఉపాసన చూపించలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ-అనుష్క జంట మాదిరిగా రామ్ చరణ్- ఉపాసన జంట కూడా తమ బిడ్డను కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అర్జిత సేవ టికెట్లు విడుదల