RamCharan & Upasana: వివాహా బంధానికి పదేళ్లు.. చరణ్, ఉపాసన పెళ్లి వీడియో వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జూన్ 14 నాటికి తమ వైవాహిక జీవితంలో ఒక దశాబ్దం (పదేళ్లు) పూర్తి చేసుకోబోతున్నారు.
- By Balu J Published Date - 02:36 PM, Sat - 11 June 22

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జూన్ 14 నాటికి తమ వైవాహిక జీవితంలో ఒక దశాబ్దం (పదేళ్లు) పూర్తి చేసుకోబోతున్నారు. ప్రతి సంవత్సరం ఈ జంట సాధారణంగా తమ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తుంటారు. వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీలోని మిలాన్‌లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ జంట తమ నివాసానికి పరిమితమైనందున ఈసారి వారు ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతుల వైవాహిక బంధానికి పదేళ్లు నిండటంతో అభిమానులు ఈ జంటకు సంబంధించిన పెళ్లి వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
https://twitter.com/filmfare/status/1535532491745857536?s=20&t=BtRboVQQ-3fIS9ufHeRa5w