Rajinikanth Maniratnam : రజిని మణిరత్నం.. ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..!
Rajinikanth Maniratnam ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక మరోపక్క మణిరత్నం ఈ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ రజినితో సినిమా చేసేలా
- By Ramesh Published Date - 04:47 PM, Sun - 6 October 24

Rajinikanth Maniratnam కొంతమంది స్టార్ డైరెక్టర్, హీరో కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. వారు చేసే సినిమాలకు ఒక రేంజ్ సెట్ చేసి ఉంటారు. అలాంటి సూపర్ హిట్ కాంబోనే మణిరత్నం, రజినికాంత్. ఈ కలయిక అనగానే అందరికీ దళపతి సినిమా గుర్తుకొస్తుంది. రజిని, మణిరత్నం (Maniratnam) ఈ కాంబో సినిమాకు ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబోలో సినిమా రాబోతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక మరోపక్క మణిరత్నం ఈ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ రజినితో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రజిని, మణిరత్నం కాంబో అంటే నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉంటాయి.
థగ్ లైఫ్ పూర్తి కాగానే ఈ కలయికలో..
థగ్ లైఫ్ పూర్తి కాగానే ఈ కలయికలో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే రజిని (Rajinikanth) సినిమా కోసం కథ సిద్ధం చేశారని తెలుస్తుంది. సో సూపర్ స్టార్, మణిరత్నం ఫ్యాన్స్ కి ఇది సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. రజిని ప్రస్తుతం వేట్టయ్యన్ సినిమా చేస్తున్నారు. ఈ నెల 10న అది రిలీజ్ అవుతుంది.
ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. కూలీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
Also Read : SBI Jobs : ఎస్‌బీఐలో 10వేల ఉద్యోగాల భర్తీ.. 600 కొత్త బ్రాంచీలు