Rajamouli : పుష్ప 2 సెట్ లో రాజమౌళి..గెస్ట్ రోల్ ఏమైనా చేస్తున్నాడా..?
Rajamouli : ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ కు రాజమౌళి వచ్చి సందడి చేసాడు
- By Sudheer Published Date - 11:25 PM, Thu - 26 September 24

Rajamouli Visits Pushpa 2 Sets : పుష్ప 2 సెట్ లో దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) సందడి చేసాడు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ (Allu Arjun) పేరే వినిపిస్తుంది.
ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ కు రాజమౌళి వచ్చి సందడి చేసాడు. భారతీయ సినిమాకు గర్వకారణమైన డైరెక్టర్ రాజమౌళి దేశంలోనే అతిపెద్ద మాస్ సినిమా సెట్స్ ను సందర్శించారని పుష్ప టీమ్ ఎక్స్లో ఫొటోను పోస్ట్ చేసింది. రాజమౌళి సెట్స్ లో కనిపించేసరికి మూవీ లో రాజమౌళి ఏమైనా గెస్ట్ రోల్ చేస్తున్నాడా..? అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళి ఈ మధ్య గెస్ట్ రోల్స్ లలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన కల్కి లో కూడా గెస్ట్ రోల్ లో కనిపించాడు. ధీంతొహ్ పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడా..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : Musk Dating Meloni: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్.. అసలు నిజమిదే..!