Alia Bhatt : అలియాకు రాజమౌళి సలహా.. అప్పటి నుంచి అదే పాటిస్తుందట..!
Alia Bhatt బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ RRR తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు. రాజమౌళి డైరెక్షన్ తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ తన అభినయంతో మెప్పించింది.
- By Ramesh Published Date - 07:20 PM, Thu - 14 March 24

Alia Bhatt బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ RRR తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు. రాజమౌళి డైరెక్షన్ తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ తన అభినయంతో మెప్పించింది. ఆ సినిమా టైం లో రాజమౌళి ఇచ్చిన సలహా తనకు ఎంతో ఉపయోగపడుతుందని అంటుంది అలియా భట్. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో రాజమౌళి సలహా తనకు ఎంతగానో హెల్ప్ అవుతుందని అన్నారు.
సినిమాల సెలక్షన్ లో తాను ఎప్పుడు ఒత్తిడి ఫీలవుతాను ఈ విషయాన్ని రాజమౌళి దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన ఏది ఎంచుకున్నా ప్రేమతో చేయండి అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు మీ నటనను ప్రశంసిస్తారని ఆయన అన్నారు. మీకు ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలు.. ప్రేమతో చేసే ఓనికి మించిన గొప్పది ఈ ప్రపంచంలో ఏది లేదని ఆయన అన్నారు. ఆయన ఇచ్చిన సజెషన్ మేరకు కథల విషయంలో చాలా క్లియర్ గా ఉంటున్నానని అన్నారు అలియా భట్.
కెరీర్ తొలినాళ్లలో తన దగ్గరకు వచ్చిన ప్రతి కథను ఓకే చేసేద్దాన్ని కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారింది. త్వరలో జిగ్రాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నటించడమే కాదు ఆమె నిర్మిస్తున్నారు కూడా.. అలియా భట్ జిగ్రా సినిమాను వాసన్ బాలా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ కూడా భాగస్వామ్యం అవుతున్నారు.
Also Read : Viswak Sen Gangs of Godhavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ ఎప్పుడు..?