Bahubali Star for Mahesh Babu : మహేష్ సినిమా కోసం మరోసారి బాహుబలి స్టార్.. రాజమౌళి సూపర్ ప్లాన్..!
Bahubali Star for Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని
- By Ramesh Published Date - 11:22 AM, Sat - 1 June 24
Bahubali Star for Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుండగా సినిమాలో కాస్టింగ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ కోసం మరోసారి బాహుబలి స్టార్ ని తీసుకుంటున్నాడట జక్కన్న. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ ని మహేష్ సినిమా కోసం తీసుకుంటున్నారట.
తనకు ఇచ్చిన ఎలాంటి పాత్రనైనా నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తూ సత్య రాజ్ మెప్పిస్తూ వస్తున్నారు. కోలీవుడ్ లో కన్నా ఆయన ఈమధ్య తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. బాహుబలిలో కట్టప్ప పాత్రకు ఆయన తప్ప మరొకరు అంత పర్ఫెక్ట్ గా సూట్ అవ్వరు అనేలా ఆయన నటించారు.
ఐతే రాజమౌళి కాస్టింగ్ సెలక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మహేష్ సినిమాలో కూడా సత్యరాజ్ కి అదిరిపోయే పాత్ర ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగు వీరిద్దరిది బాహుబలి కాంబో కాబట్టి సినిమాపై ఆ రేంజ్ కి మించే మరో హిట్ ఇస్తారని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా కోసం రాజమౌళి ప్రతి విషయంలో భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా కోసం ఇప్పటికే హాలీవుడ్ టెక్నిషియన్స్ ని దించుతున్న రాజమౌళి ఈ మూవీతో ఇంటర్నేషనల్ లెవెల్ లో మరో రేంజ్ కి వెళ్లాలని చూస్తున్నాడు.
Also Read : Vaishnavi Chaitanya : బేబీ వైష్ణవి ఇది అస్సలు ఊహించలేదుగా..!