Prabhas : రెబల్ రాజా సాబ్ కోసం రాజా మహాల్..!
Prabhas ఈ సినిమాకు సంబందించిన క్లైమాక్స్ సీన్ షూట్ చేయబోతున్నారట. దీని కోసం ఒక పెద్ద రాజా మహాల్ ని నిర్మించినట్టు తెలుస్తుంది. రాజా మహాల్ లోనే ఈ క్లైమాక్స్
- By Ramesh Published Date - 03:43 PM, Tue - 24 December 24

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న రాజా సాబ్ సినిమా దాదాపు 80 శాతం పూర్తి కాగా త్వరలో షూటింగ్ ని పూర్తి చేయాలని మారుతి అండ్ టీం ఫిక్స్ అయ్యింది. ప్రభాస్ వరుసగా చేయాల్సిన సినిమాలు ఎక్కువగా ఉన్న కారణంగా రాజా సాబ్ సినిమాను పూర్తి చేసి అతన్ని వదిలేయాలని చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన క్లైమాక్స్ సీన్ షూట్ చేయబోతున్నారట. దీని కోసం ఒక పెద్ద రాజా మహాల్ ని నిర్మించినట్టు తెలుస్తుంది. రాజా మహాల్ లోనే ఈ క్లైమాక్స్ షూట్ జరుగుతుందట. దాదాపు సినిమాలోని ముఖ్య తారాగణం అంతా ఈ ఎపిసోడ్ లో ఉంటారని తెలుస్తుంది. ప్రభాస్ తో పాటు లీడింగ్ కాస్టింగ్ అంతా ఇందులో ఉంటారట.
ప్రభాస్ రాజా సాబ్ (Raja Saab) సినిమా ఒక వెరైటీ అటెంప్ట్. మారుతి (Maruthi) చెప్పిన కథ నచ్చడం వల్లే చేయాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నా కూడా ప్రభాస్ ఈ సినిమా ఓకే చేశాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది మాళవిక మోహనన్. ఈ సినిమాలో ఆమెతో పాటు నిధి అగర్వాల్ కూడా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ కూడా రాజా సాబ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. సినిమా 2025 ఏప్రిల్ 10 రిలీజ్ అని అనౌన్స్ చేసినా అనుకున్న టైం కు రావడం కష్టమని టాక్.