Saripoda Shanivaram : శనివారం వసూళ్లకు బ్రేక్ పడేలా చేసిన వర్షాలు
సినిమా కు హిట్ టాక్ రావడం..ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రావడం తో వీకెండ్ శనివారం కు అదిరిపోయే కలెక్షన్లు వస్తాయని మేకర్స్ తో పాటు అభిమానులు భావించారు
- By Sudheer Published Date - 04:29 PM, Sat - 31 August 24

వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని (Nani) నటించిన మూవీ సరిపోదా శనివారం ( Saripoda Shanivaram ) . ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ‘అంటే సుందరానికీ’ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ పర్వాలేదు అనిపించుకుంది. అయినప్పటికీ నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి సరిపోదా శనివారం చేసాడు. ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని యాక్టింగ్ కు ఫిదా అవుతూ..నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని కామెంట్స్ చేసారు. ముఖ్యంగా నాని, ఎస్ జే సూర్యల పర్ఫామెన్స్ అదిరిపోయిందని, యాక్షన్ సీక్వెన్స్ ఫీస్ట్‌లా ఉంటుందట. ఆర్ఆర్ మాత్రం పగిలిపోయిందంటూ ప్రశంసలు కురిపించడంతో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ పరుగులు పెట్టారు. సినిమా కు హిట్ టాక్ రావడం..ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రావడం తో వీకెండ్ శనివారం కు అదిరిపోయే కలెక్షన్లు వస్తాయని మేకర్స్ తో పాటు అభిమానులు భావించారు. కానీ శుక్రవారం సాయంత్రం వాతావరణం శనివారం కలెక్షన్ల ఫై నీళ్లు చల్లింది.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న సాయంత్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం తో జనజీవనం స్థంభించింది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుండి బయటకు కాలు పెట్టాలన్న భయపడే విధంగా వర్షాలు పడుతుండం తో చాలామంది శనివారం సినిమా చూసేందుకు ఉత్సాహం కనపరచరడం లేదు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద అసలు సందడి లేకుండా అయిపోయింది. ఇంకో రెండు మూడు రోజులు వర్షాలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఎంత వర్షం వచ్చినా ప్రజలు తమ వృత్తులు, పనులు మానుకుని ఇళ్లలో ఉండరు. కానీ అదేపనిగా తుడుచుకుంటూ, ఇబ్బంది పడుతూ థియేటర్లకు వెళ్లడం అంత సులభంగా ఉండదు. అందులోనూ నగరాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్నా ట్రాఫిక్ జామ్ కు భయపడి ఆగిపోయే వాళ్ళు కొందరైతే నేరుగా కొందామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు మరో ఆలోచన లేకుండా మనసు మార్చుకుంటారు. ఇదంతా సరిపోదా శనివారంకు ఇబ్బంది కలిగించే పరిణామమే. మరి రేపైనా వర్షాలు కాస్త తగ్గితే శనివారం చూసేందుకు జనాలు ఆసక్తి కనపరుస్తారు..లేదంటే అంతే సంగతి.
Read Also : Iron Deficiency : భారతీయ పురుషుల్లో ఆ రెండూ లోపించాయి.. ‘లాన్సెట్’ సంచలన నివేదిక