Rahul Sipligunj : రజనీకాంత్ ను బాధపెట్టిన రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj : నేను వెళ్లి అడగగానే ఆయన అదే గెటప్ లో నాతో ఫోటో దిగారు. అయితే అప్పటికి ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు
- Author : Sudheer
Date : 19-10-2024 - 6:32 IST
Published By : Hashtagu Telugu Desk
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)..అంటే తెలియని మ్యూజిక్ ప్రియులు లేరు. ప్రవైట్ సాంగ్స్, ప్రవైట్ ఆల్బస్ తో పాపులర్ అయినా..రాహుల్ ..బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ లో నాటు..నాటు అంటూ అందరి చేత స్టెప్స్ వేసి పాన్ ఇండియా స్థాయిలో అలరించారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ గా ఉన్న రాహుల్..తాను రజినీకాంత్ (Rajinikanth) ను బాధపెట్టిన విషయాన్నీ గుర్తు చేసుకున్నారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. నేను సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కు వీరాభిమానిని. ఒక రోజు ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అయితే ఆయన అన్నాత్తే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయనను కలవడానికి వెళ్లగా ఆయన ఆ మూవీ లుక్కులో ఉన్నారు. నేను వెళ్లి అడగగానే ఆయన అదే గెటప్ లో నాతో ఫోటో దిగారు. అయితే అప్పటికి ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.
కాబట్టి నేను ఆ ఫోటోని ఎక్కడా కూడా పోస్ట్ చేయకూడదని వారు నాతో చెప్పారు. నేను కూడా సరే అన్నాను. అయితే కొద్ది రోజులకు నేను ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశా.. అది నేను చేసిన పెద్ద తప్పు. దానికి నేను ఇప్పటికీ కూడా బాధపడుతున్నాను అంటూ తెలిపారు. ఇలా సినిమా విడుదల అవ్వకముందే, అందులోనూ..రజనీకాంత్ లుక్ విడుదల చేయకముందే నేను షేర్ చేయడంతో టీం మొత్తం డిసప్పాయింట్ అయింది. నేను సూపర్ స్టార్ కి అభిమానిని అయినా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేశాను.. ఇక ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణనాతీతం అంటూ తన కెరియర్ లో తాను చేసిన అతి పెద్ద తప్పు గురించి చెప్పుకొచ్చాడు.
Read Also : AP Politics : వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందా..?