Radhika Sharathkumar : ఆ సినిమా ఎవరైనా చూశారా.. అహస్యం కలిగింది.. వాంతి చేయాలని ఉంది.. రాధిక ఈ రేంజ్ ఫైర్ కారణం ఏంటి..?
Radhika Sharathkumar కొన్ని సినిమాలు కొందరికి నచ్చుతాయి మరికొందరికి నచ్చవు. అయితే సమాజం మీద సినిమాల ప్రభావం ఎంత అన్నది లెక్క చెప్పడం కష్టం కానీ కొన్ని సినిమాలు చూస్తే
- By Ramesh Published Date - 06:12 PM, Sat - 27 January 24
Radhika Sharathkumar కొన్ని సినిమాలు కొందరికి నచ్చుతాయి మరికొందరికి నచ్చవు. అయితే సమాజం మీద సినిమాల ప్రభావం ఎంత అన్నది లెక్క చెప్పడం కష్టం కానీ కొన్ని సినిమాలు చూస్తే కచ్చితంగా ఇలాంటి సినిమాల వల్ల ఎంతోకొంత సమాజం మీద ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటారు.
We’re now on WhatsApp : Click to Join
అసలు సినిమాలే ఇష్టపడని వారు అవి వేస్ట్ అని అంటున్నారు. కానీ కొన్ని సినిమాల మీద కొందరు కచ్చితమైన అభిప్రాయం కలిగి ఉంటారు.
ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది అందరికి నచ్చాలని ఏమి లేదు. అలా అని సినిమా ఫ్లాప్ అయినా అందరికీ నచ్చలేదని కాదు. లేటెస్ట్ గా సీనియర్ హీరోయిన్ రాధిక ఒక సినిమా చూసి ఆమె ఎక్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు ఆ సినిమా చూశారా.. నాకు అసహ్యం వెసింది.. సినిమా మీద వాంతి చేయాలనిపించింది.. మధ్యలోనే ఆపేయాలని అనిపించింది అంటూ ఫైర్ అయ్యారు.
అయితే రాధిక శరత్ కుమార్ చేసిన కామెంట్స్ ఏ సినిమా మీద అన్నది మాత్రం పెట్టలేదు. ఇన్ డైరెక్ట్ గా ఆమె ఈ కామెంట్స్ చేశారు. అయితే రాధిక శరత్ కుమార్ చేసిన కామెంట్స్ రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన యానిమల్ సినిమా గురించే అని నెటిజెన్లు అనుకుంటున్నారు.
Also Read : Bobby Deol Udhiran : యానిమల్ తర్వాత పర్ఫెక్ట్ మూవీ.. సూర్య కంగువలో బాబీ డియోల్ లుక్ చూశారా..?
యానిమల్ సినిమా బోల్డ్ కంటెంట్ అందరికీ నచ్చదు అది శుక్రవారమే ఓటీటీలోకి వచ్చింది. రాధిక ఆ సినిమా చూసే ఈ కామెంట్స్ చేసి ఉంటారని అందరు అనుకుంటున్నారు.