Radhe Shyam Director : రాధే శ్యామ్ డైరెక్టర్ మళ్లీ భారీ ప్లానింగ్ తోనే.. ప్రభాస్ తర్వాత నెక్స్ట్ అతనే టార్గెట్..!
Radhe Shyam Director జిల్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన రాధాకృష్ణ గోపీచంద్ తో చేసినా ఆ సినిమా స్టైలిష్ ఎంటర్టైనర్ గా మెప్పించినా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్
- Author : Ramesh
Date : 05-02-2024 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
Radhe Shyam Director జిల్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన రాధాకృష్ణ గోపీచంద్ తో చేసినా ఆ సినిమా స్టైలిష్ ఎంటర్టైనర్ గా మెప్పించినా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. అయినా సరే యువి క్రియేషన్స్ అదే డైరెక్టర్ తో రెండో సారి ప్రభాస్ తో రాధే శ్యాం సినిమా చేశారు. ప్రభాస్ తో 300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేదు.
We’re now on WhatsApp : Click to Join
డైరెక్టర్ గా రాధాకృష్ణ తన ప్రతిభ చాటుతాడని అనుకోగా రాధే శ్యామ్ ఫలితం అతన్ని కెరీర్ లో వెనకపడేసింది. అయితే రాధే శ్యాం తర్వాత అతని డైరెక్షన్ లో మరో సినిమా అనౌన్స్ కాలేదు. డైరెక్టర్ గా అతను రెడీగా ఉన్నా నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదు.
అయితే లేటెస్ట్ గా రాధాకృష్ణ థర్డ్ ప్రాజెక్ట్ కు రంగ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రాధే శ్యామ్ నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా రాబోతుందట. ఈసారి తన మొదటి సినిమా హీరో గోపీచంద్ తో రాధాకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. రాధే శ్యామ్ తో నిరాశపరచినా సరే ఈసారి రాధాకృష్ణ టార్గెట్ మిస్ అవ్వడనే నమ్మకంతో అలా చేస్తున్నారట.
గోపీచంద్ తో రాధాకృష్ణ చేస్తున్న ఈ మూవీ వార్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. గోపీచంద్ కూడా హీరోగా కెరీర్ లో చాలా వెనకపడి ఉన్నాడు. రాధాకృష్ణ, గోపీచంద్ ఇద్దరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు.