Rashi Khanna Love Breakup : పాపం రాశిఖన్నా ‘లవ్ ఫెయిల్యూర్’..
Rashi Khanna love : హీరోయిన్స్ సాధారణంగా తమ లవ్ స్టోరీలు, బ్రేక్‌ల గురించి ఓపెన్‌గా చెప్పేందుకు ఇష్టపడరు. ఒకవేళ అలా చెప్తే ఇతరుల ముందు చులకన అయిపోతామని లేదా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయని భయపడుతుంటారు
- Author : Sudheer
Date : 13-11-2024 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
రాశిఖన్నా (Rashi Khanna ).. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ మూవీ తోనే యూత్ ను ఆకట్టుకుంది. ఆ తరువాత రాజా ది గ్రేట్ , హైపర్, జై లవకుశ, బెంగాల్ టైగర్ , సుప్రీమ్, జిల్ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కొత్త భామల ఏంట్రీ తో అమ్మడికి ఛాన్సులు తగ్గడం తో ఇతర భాషల వైపు అడుగులేసి..అక్కడ బిజీ హీరోయిన్ గా మారింది.
తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్. గతంలో నాకు ఓ లవ్ స్టోరీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ (Love Breakup) అయ్యింది. దాంతో నేను మానసికంగా చాలా కుంగిపోయా. ఆ తర్వాత నన్ను నేను మార్చుకుని.. కెరీర్‌పై దృష్టి పెట్టా. నా కుటుంబం, స్నేహితులు నాకు చాలా అండగా నిలబడ్డారు. వారే నా బలం’ అని పేర్కొంది. తాను ఎవరితో ప్రేమలో పడిందో చెప్పలేదు కానీ.. బ్రేకప్ వల్ల తాను పడ్డ బాధ గురించి మాత్రం ఆమె పంచుకుంది.
ఒక సినిమా హీరోయిన్‌కు స్టార్ డమ్ ఎలా ఉంటుందో తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ రిలీజైన కొన్ని రోజులకు తెలిసిందని రాశి చెప్పుకొచ్చింది. “నా తొలి చిత్రం రిలీజయ్యాక మేం తిరుపతికి వెళ్లాం. ఒక్కసారిగా జనం పెద్ద ఎత్తున మమ్మల్ని చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మేనేజర్‌ను అడిగితే వాళ్లంతా నన్ను చూడ్డానికే వచ్చారని చెప్పాడు. నేను షాకయ్యా. ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. ఫేమ్ గురించి నాకు అప్పటిదాకా తెలియదు. రాను రాను అలవాటు చేసుకున్నా” అని రాశి తెలిపింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ లో నటిస్తుంది.
ఇక హీరోయిన్స్ సాధారణంగా తమ లవ్ స్టోరీలు, బ్రేక్‌ల గురించి ఓపెన్‌గా చెప్పేందుకు ఇష్టపడరు. ఒకవేళ అలా చెప్తే ఇతరుల ముందు చులకన అయిపోతామని లేదా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయని భయపడుతుంటారు. కానీ.. హీరోయిన్ రాశీ ఖన్నా మాత్రం తన లవ్ స్టోరీ గురించే కాదు.. బ్రేకప్ గురించి కూడా ఓపెన్‌గా చెప్పడం తో అంత షాక్ అవుతూ ఉన్నారు.
Read Also : Chandrababu : ఫస్ట్ నన్ను అరెస్ట్ చెయ్యండి – జగన్