HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa Impressing In Collections

Pushpa: పుష్ప కు కలిసొచ్చిన ఎక్స్ ట్రాస్

అల్లు అర్జున్ పుష్ప.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ క్లబో లో ఎంటర్ అయింది.

  • Author : Hashtag U Date : 19-12-2021 - 4:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

అల్లు అర్జున్ పుష్ప.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ క్లబో లో ఎంటర్ అయింది. అక్కడ అంచనాల ప్రకారం టూ మిలియన్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యమేం లేదంటున్నారు. నిజానికి సినిమాకు మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. ఆ టాక్ నిజం కూడా. సెకండ్ హాఫ్ అంతా సినిమా పరమ బోరింగ్ గా ఉంటుంది. పైగా ల్యాగ్ కూడా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో ఎంటర్ అయిన ఫహాద్ ఫాజిల్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ తప్ప మిగతా అంతా సోదిలా ఉందనే టాక్ వచ్చింది. పైగా క్లైమాక్స్ లోనే అతని బట్టలు విప్పించిన పుష్పకు ఇక అతన్ని ఫేస్ చేయడం సెకండ్ పార్ట్ లో ఏమంత కష్టం కూడా కాదు అనుకోవచ్చు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పుష్పకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం అదనపు ఆటలు. యస్.. తెలంగాణ ప్రభుత్వం పుష్ప కు ఐదవ ఆటకు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకూ నాలుగు షోస్ కే పరిమితమైన థియేటర్స్ కు మరో షో అదనంగా వేసే అవకాశం రావడంతో పుష్పకు ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయనే నిజం. లేదంటే వంద కోట్ల క్లబ్ లో చేరడానికి మరో రోజు పట్టేది అంటున్నారు. అటు ఆంధ్రలో కూడా హైకోర్ట్ తీర్పు వల్ల టికెట్స్ అన్నీ బ్లాక్ లోనే అమ్మేస్తున్నారు. 100 రూపాయల టికెట్ 250కి పైగా అమ్మేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ అంతే. ప్రేక్షకుడి జేబులు చిల్లులు చేస్తూ 200- 250 రూపాయల వరకూ టికెట్ ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ‘అదనపు దోపిడీ’వల్లే పుష్పకు ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి కానీ.. నిజంగా ఒరిజినల్ రేట్లు వసూలు చేస్తే అది ఇప్పట్లో సాధ్యం కాదు అనుకోవచ్చు.
ఇక ఆదివారం తర్వాత వీక్ డేస్ లో కూడా పుష్ప స్ట్రాంగ్ గా ఉంటే తప్ప బ్రేక్ ఈవెన్ కు రాదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని దాదాపు 250కోట్ల రేషియోలో బిజినెస్ చేశారు. డివైడ్ టాక్ ఉంది. అయినా రెండు రోజుల్లో వంద కోట్లు గ్రాస్ మాత్రమే సాధించింది. అంటే అన్ని ఏరియాలూ సేఫ్ అవ్వాలంటే మరో 180కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేయాలి. కానీ మంగళవారం హాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ సిరీస్ లో ఒకటైన ‘మాట్రిక్స్ రిసరక్షన్’విడుదలవుతోంది. ఆ తర్వాత రెండు రోజులకు బాలీవుడ్ నుంచి ‘83’, టాలీవుడ్ నుంచి శ్యామ్ సింగరాయ్ వస్తున్నాయి. ఈ పోటీని తట్టుకుని ఆ రేంజ్ లో వసూలు చేయడం పుష్పకు అంత సులువేం కాదు. అయినా సాధించాడంటే మాత్రం అదో రికార్డ్ అనుకోవాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • box office
  • collections
  • one million club
  • pushpa
  • pushpa the rise

Related News

Dhurandhar 2 Box Office Collection Day 6

Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సునామీ

 Ranveer Singh రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో ఇండియా నుండి రూ. 687.43 కోట్లు రావడం విశేషం. 3 గంటల 49 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్ ఉన్నప్పటికీ, యాక్షన

  • Ranveer Dhurandhar

    Box Office : రూ. 1000 కోట్లకు పరుగులు పెడుతున్న ధురంధర్-2

Latest News

  • Balakrishna Heroine : బాలయ్య హీరోయిన్ కు చేదు అనుభవం..ఫోటో అంటూ నడుముపై చెయ్యి వేసి ..

  • Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

  • Delhi : ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం .. లష్కరే టెర్రరిస్టు అరెస్టు

  • TG Legislative Council : పోడియం వద్ద దూసుకువచ్చిన బిఆర్ఎస్ సభ్యులు.. మండలి నుంచి సస్పెన్షన్

  • Gold Price : బంగారం పతనం..కొనుగోలు దారులకు ఇదే ఛాన్స్

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd