Kuppam : చంద్రబాబు ఇలాకాలో పుష్ప 2 థియేటర్స్ సీజ్ ..షాక్ లో ఫ్యాన్స్
రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, లైసెన్స్ రెన్యూవల్ లేకుండా, ఎన్. ఓ. సీ (NOC) సర్టిఫికేట్ లేకుండా థియేటర్లు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు
- By Sudheer Published Date - 02:26 PM, Sat - 7 December 24

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 (Pushpa 2) సినిమా డిసెంబర్ 05 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. తొలిరోజు దాదాపు రూ. 280 కోట్ల కలెక్షన్లు (Pushpa 2 First Day Collections ) రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో ప్రేక్షకులు అన్ని చోట్ల బ్రహ్మ రథంపడుతున్నారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో పుష్ప 2 సినిమాను ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధించడం అభిమానుల్లో ఆగ్రహం నింపుతుంది.
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇలాకా కుప్పం(Kuppam )లో పుష్ప 2 ప్రదర్శించే థియేటర్స్ లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపడుతూ సీజ్ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను సీజ్ (Lakshmi and Mahalakshmi theatres) చేసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, లైసెన్స్ రెన్యూవల్ లేకుండా, ఎన్. ఓ. సీ (NOC) సర్టిఫికేట్ లేకుండా థియేటర్లు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా, పుష్ప 2 సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లను అధికారులు తాళాలు వేసి సీజ్ చేసారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్లు నిర్వహించడానికి ఓనర్లు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. అన్ని వసతులు, సౌకర్యాలు, పర్మిషన్లు ఉన్నాయని చూపించి థియేటర్ యాజమాన్యం అధికారుల నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఉన్న ఏ చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. అందులో భాగంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టి, పర్మిషన్ లేని వాటిని మాత్రమే సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also : Revanth Calls for New Tourism Policy : టూరిజం పై సీఎం రేవంత్ ఫోకస్..