Pushpa 2 : పుష్ప-2లో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ..?
Pushpa 2 : ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్తో ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఇందులోనే మూడో పార్ట్ కు అదిరిపోయే లీడ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది
- By Sudheer Published Date - 09:09 AM, Thu - 31 October 24
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో సినిమా తాలూకా విశేషాలు బయటకు వస్తూ సినిమా పై మరింత క్రేజ్ తీసుకొస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్తో ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఇందులోనే మూడో పార్ట్ కు అదిరిపోయే లీడ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచార తో ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారనే చర్చ టాలీవుడ్లో నడుస్తోంది.
Read Also : Diwali : పాకిస్థాన్లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్