Pushpa 2: The రూల్ – స్పీడ్ తగ్గిన ‘పుష్ప’..కారణం అదేనా..?
మరి ఇలా బ్రేక్ లు వేసుకుంటూ పోతే ..డిసెంబర్ నాటికైనా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో లేదో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లెక్కల మాస్టర్ కు అన్ని లెక్కలు సరిగ్గా ఉండాలి..లేదంటే మళ్లీ మొదటి నుండి లెక్క సరిచేయాలి అంటాడు
- By Sudheer Published Date - 04:37 PM, Tue - 16 July 24

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ (Allu Arjun – Sukumar) కలయికలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ 2021 డిసెంబర్ 17 న పాన్ ఇండియా గా విడుదలై సంచలనం సృష్టించింది. విడుదలైన ప్రతి భాషలో భారీ సక్సెస్ సాధించడమే కాదు వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ యాక్టింగ్ , సుకుమార్ స్క్రీన్ ప్లే , దేవి శ్రీ మ్యూజిక్ , రష్మిక గ్లామర్ ఇవన్నీ సినిమాను విజయతీరానికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం పుష్ప 2 కోసం యావత్ సినీ లోకం ఎదురుచూస్తుంది. ఆగస్టు 15 న ఈ మూవీ రిలీజ్ అని ముందు నుండి చెపుతూ వచ్చినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడం, పలు సన్నివేశాలు రీ షూట్ కారణంగా చెప్పిన తేదికి విడుదల చేయలేక డిసెంబర్ నెలకు పోస్ట్ పోన్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రిలీజ్ వాయిదా వేసినట్లు తెలిపిన తర్వాత షూటింగ్ అమాంతం మందగించింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్లు షూటింగ్ కు వరుస బ్రేక్స్ పడుతున్నాయి. వాస్తవానికి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్ ప్లాన్ చేసారు. కానీ తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైములో ఈ యాక్షన్ పార్ట్ లో ఉండాల్సిన విలన్ కు అనారోగ్య సమస్య రావడం తో షూటింగ్ వాయిదా వేశారు. ఇక షూటింగ్ ఎలాగూ వాయిదా వేయడం తో ఈ గ్యాప్ లో డైరెక్టర్ సుకుమార్ అమెరికా వెళ్ళాడట. నెక్స్ట్ వీక్ విలన్ ఎంట్రీ ఇస్తాను అని చెప్పడం తో సుకుమార్ కూడా ఈ వీకెండ్ నాటికీ వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడట. వచ్చే వారం యాక్షన్ పార్ట్ కు సంబదించిన షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. మరి ఇలా బ్రేక్ లు వేసుకుంటూ పోతే ..డిసెంబర్ నాటికైనా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో లేదో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లెక్కల మాస్టర్ కు అన్ని లెక్కలు సరిగ్గా ఉండాలి..లేదంటే మళ్లీ మొదటి నుండి లెక్క సరిచేయాలి అంటాడు. అందుకే త్వరగా షూటింగ్ పూర్తి చేస్తే..ఏదైనా సరిచెయ్యాలంటే మళ్లీ చేసుకోవచ్చు అని ఫ్యాన్స్ చెపుతున్నారు.
Read Also : iQOO Z9 Lite: కేవలం రూ. 10 వేలకే 5జీ ఫోన్.. ఫీచర్స్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?