HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Release Date Postponement Rumors

Pushpa 2 Postponed: పుష్ప పార్ట్ 2 వాయిదా పడినట్టేనా?

బన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్స్ విషయంలో అభిమానులు డైలమాలో పడిపోయారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయి రెండేళ్లు దాటిపోయింది

  • By Praveen Aluthuru Published Date - 07:37 PM, Thu - 25 January 24
  • daily-hunt
Pushpa 2 Postponed
Pushpa 2 Postponed

Pushpa 2 Postponed: బన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్స్ విషయంలో అభిమానులు డైలమాలో పడిపోయారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికే పార్ట్ 2 లేట్ అయిందని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే.. మరోసారి పుష్ప2 వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతోంది. అల్లు అర్జున్ కు జంటగా రష్మిక నటిస్తోంది. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో ఇక్కడ ఆడియన్స్ మాత్రమే కాకుండా… అక్కడ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు పుష్ప 2 థియేటర్స్ లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో పుష్ప 2 వస్తుందేమో అనుకున్నారు. అయితే.. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం వలన ఈ సంవత్సరం సమ్మర్ కి వస్తుందని ప్రచారం జరిగింది. ఆతర్వాత సమ్మర్ కి రావడం లేదు.. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ అని ప్రకటించారు. ఆ తర్వాత ఆగష్టు 15నే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సింగం ఎగైన్ మూవీ వస్తుంది. అందుచేత పుష్ప 2 పోస్ట్ పోన్ కావడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను మేకర్స్ ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 ఆగష్టు 15న రావడం ఖాయం అని అనౌన్స్ చేశారు.

అయితే.. ఇప్పుడు మరోసారి పుష్ప 2 వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. కారణం ఏంటంటే.. పుష్ప సినిమాలో బన్నీకి అసిస్టెంట్ గా పక్కనే ఉండే పాత్ర పోషించిన జగదీష్ పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడు. అయితే.. జగదీష్ డిసెంబర్ లో అరెస్ట్ అయ్యాడు. బన్నీ, జగదీష్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ తీయాల్సివుందట. జగదీష్ బెయిల్ కోస ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ కారణంగా పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్ పడడం వలన పోస్ట్ పోన్ ఖాయం అని టాక్ బలంగా వినిపిస్తోంది. మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. మరి.. పుష్ప 2 పోస్ట్ పోన్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: Court Problems: కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేస్తే చాలు విజయం మీదే?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • postponed
  • Pushpa 2
  • rashmika
  • release date
  • sukumar

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd