HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Midnight Shows Cancelled

‘Pushpa-2’ Midnight Shows : ‘పుష్ప-2’ మిడ్ నైట్ షోలు రద్దు..షాక్ లో ఫ్యాన్స్

'Pushpa-2' Midnight Shows : బెంగళూరు జిల్లా కలెక్టర్ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షో('Pushpa-2' midnight shows cancelled)లపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల వరకు సినిమాలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు

  • Author : Sudheer Date : 04-12-2024 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
'pushpa 2' Midnight Shows C
'pushpa 2' Midnight Shows C

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2: ది రూల్ (Pushpa 2 )సినిమా విడుదలకు ముందు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది. బెంగళూరు జిల్లా కలెక్టర్ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షో(‘Pushpa-2’ midnight shows cancelled)లపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల వరకు సినిమాలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే షోలు ఏర్పాటు చేసిన థియేటర్లు సందిగ్ధంలో పడ్డాయి.

కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదు(Complaint by Kannada film producers) మేరకు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మిడ్ నైట్ షోలు కన్నడ చిత్రాలకు నష్టం కలిగించే అవకాశం ఉందని నిర్మాతలు ఆరోపించారు. ఇతర భాషా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి స్థానిక సినిమాల ఉనికిని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలతో పుష్ప-2 అభిమానులకు నిరాశ ఎదురైంది. సినిమా యూనిట్ ఇప్పటికే పలు థియేటర్లలో మిడ్ నైట్ షోలు ప్లాన్ చేసింది. అయితే తాజా ఆంక్షల కారణంగా ఈ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బుకింగ్ లలో ఇబ్బందులు ఎదురవుతాయని థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి.

కర్ణాటక(Karnataka)లో రాత్రి 10 గంటల తరువాత నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి షోలను ప్రదర్శించకూడదని చట్టం ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు ఆంక్షలను పాటించాల్సి వస్తోంది. ప్రస్తుత నిర్ణయం కన్నడ చిత్ర పరిశ్రమకు మద్దతుగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. పుష్ప-2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో షోస్ మొదలుకాబోతున్నాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మొదలైంది. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని , రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో..? రివ్యూస్ వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలియదు.

Read Also : New Honda Amaze: రూ. 8 లక్షలకు కొత్త హోండా అమేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వ‌చ్చిన ఫీచ‌ర్లు ఇవే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'Pushpa-2' Midnight Shows
  • 'Pushpa-2' midnight shows cancelled
  • 'Pushpa-2' reviews
  • 'Pushpa-2' shows
  • allu arjun
  • karnataka
  • Pushpa 2
  • Pushpa 2 Talk

Related News

Allu Arjun

లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.

  • Bunny Next Film

    మరో తమిళ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ ?

Latest News

  • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

  • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

  • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

  • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

  • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

Trending News

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd