Pushpa 2 : ‘పుష్ప-2’ ఆల్ టైమ్ రికార్డు..
Pushpa 2 : ఈ చిత్రం బుక్ మై షో(Bookmyshow)లో విడుదలకు ముందే 30 లక్షలకు పైగా టికెట్లు ప్రీ సేల్ ద్వారా అమ్ముడుపోవడం విశేషం
- Author : Sudheer
Date : 05-12-2024 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2)సినిమా భారత సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బుక్ మై షో(Bookmyshow)లో విడుదలకు ముందే 30 లక్షలకు పైగా టికెట్లు ప్రీ సేల్ ద్వారా అమ్ముడుపోవడం విశేషం. ఈ రికార్డు సాధించడం ద్వారా ‘పుష్ప-2’ ఇండస్ట్రీలోనే అపూర్వమైన సినిమాగా నిలిచింది.
ఈ చిత్రంపై ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తూ వచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి హైప్‌ను సృష్టించింది. అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. ప్రధానంగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల ఆకట్టుకునే పాత్రలతో పాటు చక్కని సినిమాటోగ్రఫీ కూడా ‘పుష్ప-2’కి ప్లస్ పాయింట్‌గా మారాయి. ఓవరాల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ గత రికార్డ్స్ ను బ్రేక్ చేసేలా ఉన్నాయి.
Read Also : New RTC Depots : తెలంగాణలో మరో 2 ఆర్టీసీ డిపోలు.. ఏ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారంటే ?