Producer Naveen Yerneni : ఫోన్ ట్యాపింగ్ కేసులో పుష్ప నిర్మాత..
తన దగ్గర ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు
- By Sudheer Published Date - 02:51 PM, Mon - 15 April 24

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping case)వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసారని , రాజకీయ నేతలనే కాకుండా సినీ స్టార్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి కోట్లు దండుకున్నారని కాంగ్రెస్ , బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అగ్ర నిర్మాత పేరు బయటకు రావడం చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప నిర్మాత నవీన్ యర్నే(Producer Naveen Yerneni)ని పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్.. ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన దగ్గర ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని కూడా ఉన్నారని పేర్కోవడం తో పోలీసులు నవీన్ పై కేసు నమోదు చేశారు. గతంలో తాను ప్రారంభించిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని వేణుమాధవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జునరావుతోపాటు తన సంస్థలోని నలుగురు డైరక్టర్లు కూడా లబ్ది పొందారని తెలిపారు. కాగా, వేణుమాధవ్ ఫిర్యాదుతో సంస్థ ఎండీ రాజశేఖర్ తలశిల, డైరక్టర్లు.. గోపాలకృష్ణ సూరెడ్డి, నిర్మాత నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచనేని పూర్ణచంద్రరావులను ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
Read Also : LS Polls 2024 : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది..!