Naga Vamsy Comments on Sapta Sagaralu Dati : డబ్బులు ఇచ్చి మరి డిప్రెస్ అవ్వడం ఎందుకు.. తెలుగు నిర్మాత మీద మండిపడుతున్న నెటిజన్లు..!
Naga Vamsy Comments on Sapta Sagaralu Dati కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, బి రెండు తెలుగులో కూడా రిలీజ్
- By Ramesh Published Date - 11:42 AM, Sun - 26 November 23

Naga Vamsy Comments on Sapta Sagaralu Dati కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ A, B రెండు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. సైడ్ A ఒక 20 రోజులు ఆలస్యంగా తెలుగులో రిలీజ్ కాగా సైడ్ B కన్నడ వెర్షన్ తో పాటే రిలీజ్ చేశారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా సప్త సాగరాలు దాటి ఏ,బి రెండు మంచి సినిమాలుగా తెలుగు ఆడియన్స్ ఫీల్ అయ్యారు.
We’re now on WhatsApp : Click to Join
అయితే ఈ సినిమాపై తెలుగు నిర్మాత సితార బ్యానర్ సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఫిల్మ్ చాంపియన్స్ వారు చేసిన ఇంటర్వ్యూ లో డిప్రెషన్ గురించి టాపిక్ రాగా తను సప్త సాగరాలు దాటి సినిమా చూడలేదు. డబ్బులు ఇచ్చి మరి డిప్రెస్ అవ్వడం ఎందుకని చూడలేదని చెప్పాడు. అయితే దీనికి అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న కలర్స్ స్వాతి ఆన్సర్ ఇస్తూ అలాంటి సినిమాలు చూస్తే కొత్త కొత్త అభిప్రాయం వస్తుందని అన్నారు.
అయితే దానికి సమాధానంగా నాగ వంశీ తనకు ఎలాంటి కొత్త అభిప్రాయం వద్దని అన్నారు. అయితే సప్త సాగరాలు దాటి సినిమా ఫ్యాన్స్ నాగవంశీ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. ఒక నిర్మతగా సినిమాపై అలాంటి కామెంట్ చేయడంపై నెటిజెన్లు నాగ వంశీ ని టార్గెట్ చేస్తున్నారు. అసలు నువ్వెలా నిర్మాత అయ్యావ్ అంటూ విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Ranbir Kapoor Animal : మల్లా రెడ్డి కాలేజ్ లో యానిమల్ టీం.. ప్రమోషన్స్ కి కేరాఫ్ అడ్రెస్ అయ్యిందిగా..!
తను చెప్పాలనుకునే పాయింట్ చెప్పడం ప్రతి ఒక్కరి హక్కు దానికి ఎవరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. సప్త సాగరాలు దాటి సినిమాపై నాగ వంశీ కామెంట్ అది. ఒక నిర్మాత అయ్యుండి తను అలా ఒక ఫీల్ గుడ్ మూవీని అలా కామెంట్ చేయడం పట్ల తెలుగు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఎవరు డబ్బులు ఇచ్చి డిప్రెషన్ లోకి వెళ్లాలని అనుకోరు.. కానీ అలా చేయగలిగారు అంటే సినిమా సక్సెస్ అయినట్టే లెక్క. మరి ఈ లాజిక్ ని నాగ వంశీ ఎలా మిస్ అయ్యారంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఏది ఏమైనా నాగ వంశీ ఈమధ్య చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
Eedu film producer ayadu 🤢🤮🤢🤢 pic.twitter.com/Kpqn8vJIDs
— Mahanatiii (@Mahanatiii) November 25, 2023