KGF Chapter 3: ‘కేజీఎఫ్-3’ కి రంగం సిద్ధం!
‘కేజీఎఫ్’.. పాన్ ఇండియన్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కేజీఎఫ్1, 2 సిరీస్ లు బ్లక్ బస్టర్స్ హిట్ కొట్టడం.
- By Balu J Published Date - 12:44 PM, Sat - 14 May 22
‘కేజీఎఫ్’.. పాన్ ఇండియన్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కేజీఎఫ్1, 2 సిరీస్ లు బ్లక్ బస్టర్స్ హిట్ కొట్టడం. లెక్కకు మించి వసూళ్లు సాధించడం, చాఫ్టర్ -2 క్లైమక్స్ లో 3 ప్రస్తావన రావడంతో ‘కేజీఎఫ్-3’ ఉంటుందని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత విజయ్ కిర్గందూర్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. ఇటీవలి ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ నవంబర్ నాటికి సాలార్ షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారని నిర్మాత తెలిపారు.
“ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సాలార్ సినిమా చేస్తున్నాడు. దాదాపు 30 శాతం పార్ట్ పూర్తయింది. అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నాం. డిసెంబర్లో కేజీఎఫ్ 3కి సంబంధించిన పనులు ప్రారంభిస్తాం. 2023లో షూటింగ్ ప్రారంభిస్తాం. 2024లో ‘కేజీఎఫ్ 3’ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని విజయ్ కిరంగ్దూర్ తెలిపారు. “KGF 3” 2023లో సెట్స్‌పైకి వస్తే, ఎన్టీఆర్‌తో నీల్ సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Tags
Related News
Toxic : యశ్ సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ అవుట్.. ఆ స్థానంలోకి..
యశ్ 'టాక్సిక్' సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ బయటకి వెళ్లిపోయిందట. ఆమె స్థానంలోకి ఆ సౌత్ హీరోయిన్..