Actor Ashish: పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం?
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత ఏడాది చాలామంది సెలబ్రిటీలు మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలో
- By Nakshatra Published Date - 08:38 PM, Wed - 31 January 24
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత ఏడాది చాలామంది సెలబ్రిటీలు మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో మరొక యంగు హీరో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు ఆశిష్. బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు ఆశిష్. త్వరలోనే అద్వితరెడ్డినీ వివాహం చేసుకోబోతున్నారు. కాగా ఇటీవల వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక చాలా సింపుల్ గా జరిగిన విషయం తెలిసిందే. కానీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోలకు డైరెక్టర్లకు శుభలేఖలు ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు హీరో ఆశిష్. కాగా హీరో ఆశిష్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. రౌడీ బాయ్స్ సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేశాడు ఆశిష్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. 2022లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆశిష్ తన రెండో సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. అలాగే తన మూడో సినిమాను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.
Dil Raju and Shirish personally invited Man of Masses NTR @Tarak9999 for the joyous occasion of Shirish’s son, @AshishVoffl ‘s wedding. pic.twitter.com/ytd7FzpQjS
— BA Raju’s Team (@baraju_SuperHit) January 31, 2024
ఓవైపు వరసుగా సినిమాలు చేస్తున్న ఆశిష్ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏపీకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్విత రెడ్డిని ఆశిష్ వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక త్వరలోనే ఆశిష్ పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వివాహ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ క్రమంలోనే పెళ్లి పిలుపులు మొదలుపెట్టారు. ఈరోజు దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షితా రెడ్డి, శిరీష్, ఆశిష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాసంలో కలుసుకున్నారు. తారక్ కు పెళ్లి కార్డు ఇచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆశిష్ కు శుభాకాంక్షలు తెలిపారు తారక్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరల్ గా మారాయి.
Related News
NTR : వైసీపీ సభలో Jr . ఎన్టీఆర్ ఫ్లెక్సీలు..కావాలనే చేస్తున్నారా..?
కొద్దీ నెలల క్రితం వరకు టీడీపీ పార్టీ ఏ సభ పెట్టిన..ఏ ప్రచారం చేసిన జూ. ఎన్టీఆర్ ప్లెక్సీలు దర్శనం ఇచ్చేవి