Sundeep Kishan Ooruperu BhairavakOna : భైరవ కోన టీం తో బుజ్జగింపులు.. సోలో డేట్ ఇచ్చేలా..!
Sundeep Kishan Ooruperu Bhairavakona సంక్రాంతి రేసు నుంచి రవితేజ ఈగల్ ను తప్పించేసిన నిర్మాతల మండలి. ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ ఛాన్స్ ఇచ్చారు. అయితే అదే రోజు రిలీజ్ అనుకున్న
- Author : Ramesh
Date : 27-01-2024 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
Sundeep Kishan Ooruperu Bhairavakona సంక్రాంతి రేసు నుంచి రవితేజ ఈగల్ ను తప్పించేసిన నిర్మాతల మండలి. ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ ఛాన్స్ ఇచ్చారు. అయితే అదే రోజు రిలీజ్ అనుకున్న ఊరుపేరు భైరవ కోన టీం ని సంప్రదించలేదు. మీ ఇష్టానికి సోలో డేట్ అంటూ ఆ డేట్ ప్రకటిస్తే ఎలా అని ఊరు పేరు భైరవ కోన టీం ఫిబ్రవరి 9న తమ సినిమా రిలీజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఎవరేం చెప్పినా మేము మా సినిమాను రిలీజ్ చేస్తామంతే అని అంటున్నారు. ఓ పక్క ఈగల్ నిర్మాతలు నిర్మాతల మండలిని సంక్రాంతికి ఆగితే సోలో రిలీజ్ ఇస్తామని అన్నారు. మాకు సోలో రిలీజ్ కావాలని అంటూ ప్రొడ్యూస్ర్ కౌన్సిల్ కు లెటర్ రాశారు.
అయితే ఊరు పేరు భైరవకోన టీం ని సంప్రదించే పనుల్లో ఉన్నారు నిర్మాతల మండలి. ఈ క్రమంలో వారికి కూడా సోలో డేట్ ఇచ్చేలా హామీ ఇస్తున్నారట. ఫిబ్రవరి 9న వదిలేస్తే ఒక వారం ఆగితే ఫిబ్రవరి 16న ఆ సినిమా ఒక్కటే రిలీజ్ అయ్యేలా మాట్లాడుతున్నారట.
ఫిబ్రవరి 16న ఆల్రెడీ వరుణ్ తేజ్ వాలెంటైన్, గోపీచంద్ భీష్మ సినిమాలు రిలీజ్ లాక్ చేశారు. కానీ ఆ రెండు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అందుకే ఊరుపేరు భైరవకోన టీం కి ఆ డేట్ ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయట.
మరి ఈ చర్చలకు భైరవ కోన టీం ఓకే అంటుందా.. రవితేజ వర్సెస్ సందీప్ కిషన్ ఫైట్ లేకుండా నిర్మాల మండలి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రవితేజ ఈగల్ మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలతో పోటీ పడేందుకు సిద్ధం కాగా సందీప్ కిషన్ ఊరుపేరు భైరవ కోనతో పోటీ పడేందుకు వెనకడుగు వేయడం ఆశ్చర్యకరంగా ఉంది.