Waheeda Rehman : వహీదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Waheeda Rehman : 2023 సంవత్సరానికిగానూ దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ ఎంపికయ్యారు.
- Author : Pasha
Date : 26-09-2023 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk
Waheeda Rehman : 2023 సంవత్సరానికిగానూ దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ ఎంపికయ్యారు. ఈవిషయాన్ని కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. భారత చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్లు తెలిపారు. వహీదా రెహమాన్ వయసు 85 ఏళ్లు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో వహీదాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని ఐదుగురు సభ్యులు వహీదా రెహమాన్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also read : Miracle After 41 Years : ఆసియా క్రీడల్లో భారత్ కు మూడో గోల్డ్.. గుర్రపు స్వారీలో 41 ఏళ్ల తర్వాత స్వర్ణం
‘‘భారతీయ సినిమాకు అద్భుతమైన సేవలు అందించిన వహీదా రెహమాన్ జీకి దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించడానికి సంతోషిస్తున్నాను’’ అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ప్యాసా, కాగజ్ కే ఫూల్ , చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి, ఢిల్లీ 6 వంటి చిత్రాలతో వహీదా రెహమాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా కమల్ హాసన్ విశ్వరూపం, స్కేటర్ గర్ల్ సినిమాలో వహీదా (Waheeda Rehman) అతిథి పాత్రలో కనిపించారు.