SPY Movies : స్పై కథలు పెరుగుతున్నాయి. ‘స్పై’ క్యారెక్టర్స్ లోకి మారిపోతున్న మన హీరోలు..
గతంలో కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కమల్ హాసన్.. లాంటి పలు హీరోలు స్పై, సీక్రెట్ ఏజెంట్స్ గా సినిమాలు తీసి మెప్పించారు.
- By News Desk Published Date - 07:30 PM, Fri - 19 May 23
సినీ పరిశ్రమలో స్పై(SPY) కథలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. గూడాచారి పాత్రల్లో మన హీరోలు చేసే విన్యాసాలు, యాక్షన్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ప్రేక్షకులని మెప్పిస్తాయి. కానీ ఇలాంటి స్పై కథలు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. లేదంటే డిజిస్టార్ గా మారతాయి. స్పై కథల్లో హీరో బాడీ, యాక్షన్, యాక్టింగ్ తో పాటు కథలో ఆసక్తికర మలుపులు, ట్విస్టులు ఉండాలి అప్పుడే స్పై సినిమాలు సక్సెస్ అవుతాయి.
గతంలో కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కమల్ హాసన్.. లాంటి పలు హీరోలు స్పై, సీక్రెట్ ఏజెంట్స్ గా సినిమాలు తీసి మెప్పించారు. కొన్నేళ్ల క్రితం రాజశేఖర్, బాలకృష్ణ, గోపిచంద్, విజయ్, విక్రమ్.. పలువురు హీరోలు ఈ స్పై పాత్రల్లో సీక్రెట్ ఏజెంట్స్ గా నటించి మెప్పించారు. ఇటీవల కాలంలో మళ్ళీ స్పై సినిమాలు ఎక్కువవుతున్నాయి.
కొన్ని నెలల క్రితం కార్తీ(Karthi) సర్దార్(Sardar) సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో కార్తీ తండ్రి కొడుకుల్లా నటించడమే కాక సీక్రెట్ ఏజెంట్, స్పై పాత్రలో నటించి మెప్పించాడు.
ఇక అడివి శేష్(Adivi Sesh) గతంలోనే గూడాచారి(Goodachari) సినిమాలో సీక్రెట్ ఏజెంట్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు గూడాచారి 2 కూడా తెరకెక్కిస్తున్నాడు. గూడాచారి చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించడంతో గూడాచారి 2పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవల అక్కినేని అఖిల్(Akhil) కూడా ఏజెంట్(Agent) సినిమాతో స్పై అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, కథ సరిగ్గా లేక డిజాస్టర్ పాలైంది. స్పై సినిమాలు ఎలా తీయొద్దో ఒక ఉదాహరణగా నిలిచింది.
త్వరలో నిఖిల్(Nikhil) స్పై సినిమాతో రాబోతున్నాడు. స్పై క్యారెక్టర్ చేస్తూ సినిమా పేరు కూడా స్పై అని పెట్టుకోవడం విశేషం. ఈ సినిమాను జూన్ 29న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసే సినిమా కూడా స్పై కథే అని సమాచారం. ఇప్పటికే ఓ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.
కళ్యాణ్ రామ్ త్వరలో డెవిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా కూడా స్పై క్యారెక్టర్ అని ఇప్పటికే చిత్రయూనిట్ చెప్పేశారు. ఇలా ఇప్పుడు యువ హీరోలంతా ప్రేక్షకులని సస్పెన్స్ థ్రిల్లర్ చేయడానికి స్పై సినిమాలతో రాబోతున్నారు. మరి వీటిల్లో ఎంతమంది స్పై క్యారెక్టర్ తో మెప్పిస్తారో చూడాలి.
Also Read : Aishwarya Rai : రెండు దశాబ్దాలుగా.. ప్రతి సంవత్సరం కాన్స్ లో ఐశ్వర్య రాయ్ హాజరు.. మొదటిసారి ఎప్పుడో తెలుసా??
Related News
Samyukta Menon : లక్కీ హీరోయిన్ టాలీవుడ్ కథ అప్పుడే ముగిసిందా.. అలా పక్కన పెట్టేశారేంటి..?
Samyukta Menon మలయాళం నుంచి వచ్చే భామలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ సత్తా చాటుతున్న కొందరు టాలీవుడ్ లో కూడా తమ లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తుంటారు.