Los Angeles Wildfires : కార్చిచ్చులో బాలీవుడ్ నటి
Los Angeles Wildfires : పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ సహా పలువురు సెలబ్రిటీల ఇళ్లు కాలిపోయాయి
- Author : Sudheer
Date : 12-01-2025 - 2:15 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికాలోని లాస్ ఏంజలెస్ ప్రాంతంలో కార్చిచ్చు (Los Angeles Wildfires) తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ సహా పలువురు సెలబ్రిటీల ఇళ్లు కాలిపోయాయి. సినీ తారల బంగ్లాలతో కళకళలాడే ఈ నగరం లోపల, చుట్టూతా ఆరు చోట్ల చెలరేగిన అగ్నికీలలతో వెయ్యికి పైగా నిర్మాణాలు కాలిపోయాయి.ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ నటి ప్రీతి జింటా (Preity Zinta) కూడా ఈ కార్చిచ్చులో చిక్కుకున్నారు. ఆమె ఈ అనుభవాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
Rajanna Sircilla : మహిళపై గుంటనక్క దాడి
ప్రీతి తన ట్వీట్‌లో..”చుట్టూ జరుగుతున్న విధ్వంసం చూసి భయాందోళనకు గురయ్యాను. చిన్న పిల్లలు, వృద్ధులతో చాలా మంది పొరుగువారు ఇళ్లను వదిలి వెళ్లిపోవడం నా మనసును తీవ్రంగా కలచివేసింది. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు దేవుడికి & అగ్నిమాపక సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. ఈ కార్చిచ్చు కారణంగా అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళం కార్చిచ్చును అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నప్పటికీ, తీవ్ర గాలులు దాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి అని పేర్కొంది. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం మరింత విస్తరించే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.