HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pre Release Event For Nirupam Paritala Premi Viswanath Karthika Deepam 2 Serial

Karthika Deepam 2 : సీరియల్‌కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. కార్తీకదీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు కోసం ఎదురుచూపులు..

కార్తీకదీపం 2 సీరియల్ కి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు.

  • By News Desk Published Date - 06:06 AM, Thu - 21 March 24
  • daily-hunt
Pre Release Event for Nirupam Paritala Premi viswanath Karthika Deepam 2 Serial
Pre Release Event for Nirupam Paritala Premi viswanath Karthika Deepam 2 Serial

సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం చూసాం కానీ సీరియల్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారా? మొదటి సారి ఓ సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ జనరేషన్ లో సీరియల్స్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా తక్కువ. కానీ బుల్లితెర ప్రేక్షకుల‌ను క‌ట్టిప‌డేసి ఐపీఎల్ సమయంలో కూడా దానికి మించి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని, దేశంలోనే ఎక్కువ టీఆర్పీతో సక్సెస్ అయిన సీరియల్ కార్తీక దీపం(Karthika Deepam).

ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంట‌ల‌క్కగా నటించిన నిరుపమ్, ప్రేమి విశ్వనాధ్ ఒరిజినల్ పేర్లు కూడా మర్చిపోయి ఆ పేర్లతోనే పిలిచేలా సక్సెస్ అయ్యారు. 2017 అక్టోబర్ నుంచి 2022 జనవరి వరకు ఈ సీరియల్ సాగి ఎంతోమంది తెలుగు మహిళా ప్రేక్షకులని అలరించింది. ఇప్పుడు పేక్షకుల కోరిక మేరకు ఈ సీరియల్ కి సీక్వెల్ రాబోతుంది. ఆల్రెడీ ఇటీవలే కార్తీక దీపం 2 ప్రోమో కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సీరియల్ స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది.

అయితే ఈ సీరియల్ కి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు. నేడు మార్చి 21 మధ్యాహ్నం 2 గంటల నుండి హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో కార్తీకదీపం 2 సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కి నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ తో పాటు సీరియల్ యూనిట్ అంతా హాజరవ్వనున్నారు. దీంతో అభిమానులు భారీగానే ఈ ఈవెంట్ కి రానున్నారు. సీజన్ 2 కూడా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

View this post on Instagram

A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala)

 

Also Read : RGV : ‘నా పెళ్ళాం దయ్యం’ అంటున్న ఆర్జీవీ.. ఇంతకీ ఆ పెళ్ళాం ఎవరో?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Doctor Babu
  • Karthika Deepam 2
  • Nirupam Paritala
  • Premi Viswanath
  • Vantalakka

Related News

    Latest News

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

    • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd