RGV : ‘నా పెళ్ళాం దయ్యం’ అంటున్న ఆర్జీవీ.. ఇంతకీ ఆ పెళ్ళాం ఎవరో?
తాజాగా ఆర్జీవీ ఓ కొత్త టైటిల్ తో సినిమాని ప్రకటించాడు.
- Author : News Desk
Date : 21-03-2024 - 5:48 IST
Published By : Hashtagu Telugu Desk
సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) 20 ఏళ్ళ క్రితమే తన సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్ ని ఏలేసాడు. ప్రస్తుతం సరదాకి, కాంట్రవర్సీల కోసం సినిమాలు చేస్తున్నాడు. తన సినిమాలతోను, తన ట్వీట్స్ తోను రెగ్యులర్ గా వార్తల్లో ఉంటాడు ఆర్జీవీ. అప్పుడప్పుడు కొత్త కొత్త టైటిల్స్ తో సినిమాలు అనౌన్స్ చేస్తాడు. అందులో చాలా వరకు బయటకి రావు కూడా.
తాజాగా ఆర్జీవీ ఓ కొత్త టైటిల్ తో సినిమాని ప్రకటించాడు. ‘నా పెళ్ళాం దయ్యం’ అనే ఓ టైటిల్ ని ప్రకటిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. పోస్టర్ మీద టైటిల్ తో పాటు ఓ తాళిని, వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో ఓ మహిళ వంటింట్లో పని చేసుకున్నట్టు బ్లర్ లో చూపించారు. దీంతో ఈ టైటిల్, పోస్టర్ వైరల్ గా మారాయి.
మరి ఈ సినిమా అయినా రిలీజ్ అవుతుందా? లేక టైటిల్ అనౌన్స్ వరకేనా? ఎందుకు వర్మా ఇలాంటి సినిమాలు తీస్తావు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆర్జీవీ తన సినిమాలతో కొత్త కొత్త అమ్మాయిలని పరిచయం చేస్తూ ఉంటాడు. మరి ఈ సినిమాతో ఎవర్ని పరిచయం చేస్తాడో? ఇందులో ఏ అమ్మాయి పెళ్ళాంగా కనిపించబోతుందో చూడాలి.
Also Read : Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌తో జనసేనకు ఇబ్బంది.?