Hanuman : హనుమాన్ ని తక్కువ అంచనా వేయలేం..!
Hanuman ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా హీరోగా చేస్తున్న సినిమా హనుమాన్. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఈ సినిమా భారీ అంచనాలతో
- By Ramesh Published Date - 10:41 AM, Wed - 3 January 24

Hanuman ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా హీరోగా చేస్తున్న సినిమా హనుమాన్. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. సినిమా విజువల్స్ అన్ని ప్రాజెక్ట్ మీద భారీ హైప్ తెచ్చాయి. సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు మేకర్స్. సంక్రాంతికి స్టార్ సినిమాలకు పోటీగా హనుమాన్ వస్తుంది. అయితే ఈ పోటీ ఊహించనిదే అయినా ఇప్పటివరకు తమని నడిపించిన ఆ హనుమంతుడే ఈ సినిమాను నడిపిస్తాడని అంటున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని తీసుకొస్తున్నారు. సినిమాపై బజ్ పెంచేందుకు చిరు ఈవెంట్ కి అటెండ్ అవుతున్నారు. అయితే ఎంత స్టార్ సినిమాలు వస్తున్నా ప్రశాంత్ వర్మ మొదటి సినిమా అ! నుంచి జాంబి రెడ్డి వరకు అతని వర్కింగ్ స్టైల్ చూస్తే హనుమాన్ ని అంత తక్కువ అంచనా వేయలేమని చెప్పొచ్చు. విజువల్స్ చూస్తే సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉంది.
హనుమాన్ టైటిల్ తో హనుమంతుడి కథతో వస్తున్న ప్రశాంత్ వర్మ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. తేజా సజ్జా కూడా సినిమా ఆడియన్స్ ని అలరించడంలో సక్సెస్ అవుతుందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటివ్ యూనివర్స్ నుంచి వస్తున్న హనుమాన్ ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Samantha : త్రిష ప్లేస్ లో సమంత.. చేజారిన గోల్డెన్ ఆఫర్..!